Tuesday, October 8, 2019

అమ్మమ్మ ఊరు... దసరా పండుగ

ఉదయం 9 కావొస్తుంది. రైలు లొ officeకి వెళ్తూ facebook open చేయగానే   friends post  చేసిన  బతుకమ్మ photos చూసి నా ఆలోచనలు గతంలోకి   పరుగులు తీయటం మొదలు పెట్టాయి.
ఇప్పుడంటే ఎక్కువ excitement  లేదు కాని చిన్నప్పుడు దసరా వస్తుందంటే ఎన్ని రోజుల ముందు నుండి ఎదురుచూసే వాళ్ళమో.
ఇంకా చెప్పాలంటే దసరా కూడా కాదు మాకు  బతుకమ్మ రోజే పెద్ద పండగ.  ఏ పండగకి ఎక్కడ ఉన్నా  దసరా కి మాత్రం అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళాల్సిందే.

అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తుంటే దారి పొడవునా పచ్చటి పొలాలు , ఎడ్లబండ్ల మీద వెళ్తున్న   రైతులు ఎదురుపడేవారు. ఊరు దగ్గర పడుతోందనటానికి గుర్తుగా రోడ్డు పక్కనే ఉన్న అంబేత్కర్, గాంధీ తాత  నాయకుల విగ్రహాలు కనిపిస్తూ ఉండేవి.అవి దాటిన తరువాత అమ్మ చదువుకున్న గవర్నమెంటు స్కూల్ యిప్పటికీ  చెక్కు చెదరకుండా అలానే ఉంది. 
ఇంట్లొకి వెళ్లగానే ఆప్యాయంగా  పలకరింపులు , ఇంటి నిండా బందువులు,కుంకుడు కాయ స్నానాలు, కొత్త బట్టలు, గోరింటాకు సరదాలు, పండుగ రోజు సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూడటం. ఎన్ని మరుపు రాని జ్ఞాపకాలో.       

వారం  ముందు నుండే పెద్ద బతుకమ్మ రోజు కి కావాల్సిన పూలు సేకరించడం మొదలయ్యేది. గునుగు పూలు లాంటివి ముందే తీసుకొచ్చి , జాగ్రత్తగా ఒకే సైజులో కత్తిరించి, వాటికి రంగులు వేసి  కట్టలుగా చేసి పెట్టెవాళ్ళు.  
పండుగ రోజు ప్రొద్దున్నే లేచి cousins తొ  కలిసి గుమ్మడి పూల కొసం ఇంటి చుట్టూ, పక్కనే ఉన్న తోటలో వెతికే   వాళ్లం.  మళ్ళీ లేట్ గా లేస్తే ఎవరో ఒకరు ఆ పూలు కోసుకెళ్తారు.  
 తోటలొకి వెళ్లి   బస్తాల కొద్ది తంగెడు పూవు తెచ్చి, పొద్దున్నె బతుకమ్మ పేరుస్తుంటె  పిల్లలం అంతా సహయం చెసేవాళ్లం.

సాయంత్రం   కాగానే  అందరం  ready అయ్యి బతుకమ్మలతొ  ఊరి చివర చెరువు దగ్గరికి వెళ్లేవాళ్లం. దారి పొడుగునా , ఎవరి బతుకమ్మ బావుంది    అని చూడటం , అందరితొ    కబుర్లు  భలే  సరదాగ  ఉండేది .  

 చీకటి పడే వరకు ఆడి,  బోలెడు బతుకమ్మ   పాటలు పాడి/విని   ఊరి చివర ఉన్న చెరువులో అన్ని బతుకమ్మలు వేసి , ఇంటికి వచ్చెసరికి రాత్రి అయిపొయెది.  బతుకమ్మ పండగ అయిపొయింది అని దిగులు ఉన్నా, తెళ్లారితే దసరా  అనే సంతొషం.   

మేము లేచెసరికి పెద్దవాళ్లు   బొలెడన్ని పిండి వంటలు చేసెవారు.       జమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకొవటం, నీలి రంగులొ ఏ పక్షి కనిపించినా పాలపిట్ట  అనుకొవటం,  అందరం కలిసి కూర్చుని బోజనాలు ఎన్ని జ్ఞాపకాలొ. 

station వచ్చేసింది  అన్న announcement తొ ఉలిక్కి పడిన నేను బాగ్  తీసుకుని   హడావిడిగా రైలు దిగి , మళ్లి పండుగ కి అమ్మమ్మ  వాల్లింటికి   ఎప్పటికి వెళ్తానొ   అని ఆలోచిస్తూ దిగాలుగా office వైపు అడుగులేశాను.  

 దసరా పండుగలో అప్పటికి ఇప్పటికి ఎంతో  మార్పువచ్చింది, కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం అలాగే ఎంతో మధురంగా ఉన్నాయి. 



Image may contain: 2 people, including Jyothi Peddireddy