నిత్యం నీ ప్రేమ ధ్యానం లో , నీతో సహజీవనం చేస్తున్న నా హృదయానికి ఒంటరితనమెక్కడిది...? ఎంత దూరాన వున్నా .. ఉదయకాంతిలా ప్రసరిస్తూ,జీవనదిలా ప్రవహిస్తూ చైతన్యం చేరవేస్తూ, నన్ను జాగృత పరుస్తూ నిత్యసంతోషాన్ని అందిస్తున్న నువ్వు ఉండగా నేను ఒంటరినెలా అవుతాను..? నిత్యం నా పై ప్రేమ వెన్నెల జాలువార్చే పున్నమి జాబిలి వుండగా, క్షణమైనా నను వీడని నీ తలపులు నాతొ ఉండగా నాకు ఒంటరితనమెక్కడిది?
అలసిపోయాను నిరాశలో.... నిన్ను వద్దనుకున్న ప్రతిసారీ, వెళ్లలేకపొతున్నందుకు నీ మీద కోపం వచ్చినా, ప్రేమ చూపించాల్సి వచ్చినప్పుడు నిన్ను దూరం చేసుకుందామనిపించినపుడల్లా, నీకు దగ్గరయ్యే పరిస్ధితి వచ్చినప్పుడు నిన్ను ఇంకెప్పుడూ చూడకూడదనుకున్న ప్రతిసారీ, ఎదురుగా నువ్వే ఉన్నప్పుడు నిన్ను మార్చాలనుకున్న ప్రతి విఫలయత్నం దాటి, అలవాటుగా నీవు చేసిన పనిలో అర్థం వెతుక్కున్నప్పుడు నువ్వు నిజమైన ప్రతిసారీ నేను అబద్ధమై అలసిపోతూనే ఉన్నాను.... ఆ అలసట లొ ఓడిపొతునేఉన్నాను