చిట్టి తల్లి ... ఎవరని చూస్తున్నావా .. నేనే రా అమ్మని ..
నీ రెండవ పుట్టిన రోజు నీకోసం ఒక ఈ లేఖని రాయాలనుకున్నాను .. నాకు తెలుసు నువ్వు అప్పుడే చదవలేవని .. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఈ లేఖని నువ్వు చవినప్పుడు నీకు అర్ధం అవుతుంది నాకు నువ్వంటే ఎంత ఇష్టమో ...
ఏంటో రోజులు ఎంత తొందరగా గడిచిపోతున్నాయి .. అప్పుడే ఎంత పెద్దదానివైపోయావు అనిపిస్తుంది .. మొన్నేగా బోర్లా పడ్డావు .. అప్పుడే ఇల్లంతా పరిగెత్తి మమ్మల్ని పరిగెత్తిస్తున్నావు :)
నువ్వు చెప్పే చిన్ని చిన్ని మాటలు , నువ్వు అమ్మ అని ముద్దుగా పిలవటం .. Hug Me అంటూ వచ్చి నన్ను గట్టిగా వాటేసుకోవటం నాకు ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో మాటల్లో చెప్పలేను.
నువ్వు నిద్రపోతుంటే ప్రశాంతంగా , అమాయకంగా కనిపించే నీ ముఖం ఎంత సేపు చూసినా నాకు తనివి తీరదు.
నువ్వు నా జీవితం లోకి వచ్చి ఈరోజు కి సరిగ్గా 730 రోజులు . ఈ 730 రోజుల్లో నువ్వు మా మీద చూపించిన ప్రేమ, మాకు కలిగించిన సంతోషం మాటల్లో వెల కట్టలేనిది .
నీ చిరునవ్వుతో , చిట్టి చిట్టి చేష్టలతో ఎంత బాధలో ఉన్నవారినయినా నవ్వించగలవు . నువ్వు ఇలాగే ఇంకో 100 సంవత్సరాలు నవ్వుతూ, నీ పక్కనున్నవారిని నవ్విస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ..
I Love You so much Veda Baby.
బోర్లా పడితే బొబ్బట్లు
నీకు 4 mothns .. తాతయ్య తో షికారు కెల్లటానికి ready
కృష్ణాష్టమి రోజు చిన్ని కృష్ణుడి లా నీ చిరునవ్వులు చూసి ఎంత సంబర పడ్డామో ..
నీకు సరిగ్గా 6 Months.. కేక్ కట్ చేసి నీకు పెట్టకుండా మేము తినేసాము :)
మొదటి సారి నీకు రెండు పిలకలు వేసి, నేను మురిసిపోయిన రోజు .
Halloween 2011
India వెళ్ళినప్పుడు మావయ్య తో ఆడుకుంటూ
తిరుమల తిరుపతి దేవస్తానం లో తల నీలాలు సమర్పించాక
చిన్నప్పుడు, ఇప్పుడు కూడా నీళ్ళతో ఆడటం కంటే ఇష్టమైన పని నీకు ఇంకోటి ఉండేది కాదు
అడుగులకి అరిసెలు
నీ మొదటి పుట్టినరోజు వేడుక
Mother's Day రోజు downtown లో మనం matching matching dress వేసుకుని తిరుగుతూ
ఈ రోజుకి నువ్వు మా జీవితాల్లోకి అడుగు పెట్టి సరిగ్గా 500 రోజులు
మొదటి రాఖి పండుగ
కృష్ణాష్టమి 2012
నువ్వు, నేను, నాన్న.. అమ్మమ్మ ని తాతయ్యని తీసుకుని Niagara Falls చూడటానికి వెళ్ళినప్పుడు
Elevators, Escalators చూస్తే చాలు పరిగెత్తేదానివి
Chicago River లో Boat లో నీ 18 Months Birthday
Halloween 2012
Dec 2012 , మావయ్య పెళ్ళిలో