బాధను పెంచే బంధంలో
వేదన నిండిన కాలంతో
కొనసాగుతూ దగ్గర అవడం కన్నా
వైదొలగి వైరుధ్యాలకు దూరమైతేనే మేలు
మానవ సంబంధం ఏదైనా
ప్రేమతో అభిమానంతో నిజాయితీగా
నడిచినంత వరకే విలువ
అవి మాసిపోనంత వరకూ
ప్రతీ బంధమూ ఆనంద సాగరమే...
మరిచిన క్షణమే అవుతాయి
బంధించే ప్రతిబంధకాలుగా..
అపార్థంతో అపోహతో ముడిపడి
సరదా కోసమో స్వార్థం కోసమో
చేసే చెలిమీ.. చూపే ప్రేమా
నకిలి అని తెలిసిన రోజున
మోయలేని భారమై భయపెడుతుంది
ఆడేవాళ్ళకు ఆటైనా బలైన వాళ్ళకు వేట
బాధేదైన మనసుని వేధిస్తుంటే
పదే పదే తిరస్కారాల రుచి చూపిస్తుంటే
స్వీకరిస్తూ నవ్వగలిగే గొప్పతనం
ఆమోదిస్తూ సహనం చూపే మంచితనం
మారుతారేమో అనే గుడ్డి నమ్మకం
అర్థంచేసుకోనివాళ్ళకోసం
ఎన్నాళ్ళు చేసినా అది వృథా ప్రయాసే...!!
No comments:
Post a Comment