నీ రాక తో మా జీవితాల్లోకి ఎంతో సంతోషం తెచ్చిన బంగారు తల్లి దియా కి స్వాగతం .
నువ్వు నా ప్రపంచం లోకి అడుగు పెట్టి అప్పుడే రెండు నెలలు అయిపోయాయి .. చూస్తుండగానే రోజులు , వారాలు, నెలలు గడిచిపోతున్నాయి .. నిన్ను మొదటి సారి నా చేతుల్లోకి తీసుకున్న క్షణం నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు అనుకునే క్షణం లోనే .. అమ్మా నీకు పోటి గా నేనున్నాను అంటూ చెల్లి చెల్లి అని పిలుస్తూ ప్రత్యక్షమవుతుంది మీ అక్క వేద:) మా జీవితాల్లో సంతోషం నింపిన మీరిద్దరూ కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
No comments:
Post a Comment