Tuesday, December 6, 2016

అనుకోని పరిచయం

శనివారం ఉదయం దిగాలుగా మొదలయ్యింది, ముందు రోజు వేద వాళ్ళు India వెళ్ళటం తొ. TANA వాళ్ళు పేద విద్యార్దుల scholarship  కోసం badminton games conduct చేస్తున్నారు అని చూడటానికి  friend రమ్మనటంతొ వెళ్ళాను. బయటే నిల్చుని చూస్తుంటె , చక్కగా చీరలొ చూడముచ్చటగా ఉన్న అమ్మాయి , లొపలికి రండి అని ఆత్మీయంగా   పిలిచింది.   కొందరిని చూసిన మొదటసారే ఎప్పుడో ఎక్కడో చూసినట్లు, ఎంతో పరిచయం ఉన్నట్లు ఏదో ఆత్మీయతాభావానుభూతి కలుగుతుంది.  నవ్య ని చూడటం మొదటిసారె అయినా ఎంతో పరిచయస్థురాలన్న అనుభూతి కలిగింది. తన  చిన్నారులు ఐశ్వర్య ,వైష్ణవి ని చూడగానే  ఏదో ఆత్మీయత! హృదయంలో అభిమానపు స్పందనలు! అలా match చూస్తూ, నవ్య, aunty,   పిల్లల  కబుర్లతొ కొన్ని గంటలు నిమిషాల్ల గడిచిపొయాయి.   అలా  దిగాలుగా మొదలయ్యిన ఆ రోజు నవ్య,ఐశ్వర్య ,వైష్ణవి , aunty తొ అయిన అనుకోని పరిచయం వల్ల   మంచి జ్ఞాపకాలతొ ముగిసింది.

జీవితం అనే రైలు ప్రయాణం లో ఎన్నెన్నో మలుపులు, కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులు, కొత్త మధురానుభూతులు..   కొందరు దగ్గర ఉన్నా  పట్టించుకోము. కొందరు  దూరంగా ఉంటె తట్టుకోలేము.  కానీ కొంత మంది  మాత్రం ఎక్కడున్నా   మనసులో ఎప్పుడు మెదులుతూనే ఉంటారు. 


Tuesday, May 17, 2016

ప్రకృతి ..నిత్యనూతనం నీ పరిచయం

ఈ ఉరుకుల పరుగుల రోజువారీ జీవితంలో కాస్త విరామం తీసుకుని , ఈ కాంక్రీట్ జంగల్ నుంచి పారిపోవాలనిపిస్తుంది.. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా పీల్చుకుని పచ్చని ప్రకృతి ఒడిలో వాలిపోవాలనిపిస్తుంది .  కాలాన్ని మర్చిపోయి కలల తీరంలో నిల్చిపొవాలనిపిస్తుంది .   పిల్ల కాలువలో నిలబడి చల్లని నీరు నా పాదాలను తాకుతూ, ఎలా ఉన్నావంటూ పిల్లగాలి నా మేను నిమురుతూ చెప్పె పలకరింపులు..  ఇవన్నిటి మధ్య సాగే ప్రయాణాన్ని ముగించాలంటే మనసంగీకరించదెమో . 

 ఈ కంప్యూటర్లు, సెల్ల్ఫొన్ల   వల్ల మనుషులు ప్రకృతికి దూరం అయిపొతున్నారనిపిస్తుంది..  ముఖ్యంగా పిల్లలు.

మన చిన్నతనంలొ కనీసం సెలవుల్లొ అయినా పచ్చని పంట పొలాల్లో ఒడ్లవెంట తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించేవాల్లము. చెరువులు, కుంటల్లో మునిగితేలటం , ప్రకృతి ప్రసాదితమైన పండ్లు, కాయలు తెంపుకుని తినటం  , ఆ పల్లె అందాలు, పల్లె అనుభూతులు..  ఇవన్నీ  తలుచుకుంటే,  ఇప్పటి  పిల్లలు  ప్రకృతికి  ఎంత  దూరంగా  బ్రతుకుతున్నారో  కదా    అనిపిస్తుంది. కాంక్రీటు అరణ్యాలలో, నిలువెత్తు భవనాలలో, ఎసి తరగతులలో ప్లాస్టిక్ మొక్కల పచ్చదనమే మహాద్భాగ్యంగా బ్రతుకుతున్నారు ఈనాటి పిల్లలు. ప్రకృతిని పుస్తకాలలోనే చూసిన పిల్లలకు ప్రత్యక్షంగా ప్రకృతిని ,వన్యప్రాణిని పరిచయం చేద్దాము,   పర్యావరణ సంబంధ యాత్రలు పిల్లలకు ఎంతో విజ్ఞానాన్ని ఇవ్వడమే కాక తక్షణపరిసరాలతో అనుబంధాన్ని ఏర్పరుస్తాయి. ప్రకృతి నేర్పే పాఠాలు పిల్లల మనోవికాసానికి పునాది వేస్తాయి.  కనీసం నెలలొ ఒకటి రెండు రొజులైనా యాంత్రిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో హాయిగా గడుపుదాము. వారంతం లో షాపింగ్ మాల్ కి వెళ్ళడం కన్నా పచ్చని చెట్లు, కొండల మధ్య ప్రకృతి లొ తిరగటం  మనసుకి,మనషికి రెంటికి మంచిదే కదా....  



Wednesday, March 23, 2016

వచ్చేసిందీ .. వసంత కాలం

Cousin పెళ్ళి కొసం కొద్ది రోజులు India వెళ్ళి  వచ్చేసరికి   మోడు పోయిన మా ఇంటి మందారం మొగ్గలతొ నిండుగా కనిపించింది. ఇలా కొమ్మ కొమ్మ కి పూలు పూసి కళకళలాడుతూ ఉంటే ఎంత సంబరంగా ఉందో!



 ఎక్కడికి వెళ్ళినా దారి వెంట పువ్వులు ఎంత అందంగా కనిపిస్తున్నాయొ . ప్రకృతి తన అందాలతొ  కనులకు విందును కలిగించె ఈ  వసంత కాలం అంటె నాకు ప్రత్యెకమైన అభిమానం . అమెరికా లో వసంత ఋతువు వచ్చింది అంటే చాలు,  చెట్లకి ఆకులు అన్నవి కనపడవు, పువ్వులతొ నిండుగా భలె అందంగా ఉంటాయి. దారి వెంట నడుస్తుంటె పూలవాసన ని మోసుకుంటూ వచ్చే  గాలి, పక్షుల కిల కిలా రావాలు  మనస్సుకు మైమరుపు కలిగిస్తాయి   . పొద్దున్నె మా ఇంటి కిటికీ దగ్గర నిలబడి  , అందమైన సుర్యొదయం , పూల మొక్కలు , పక్షులు .. అందమైనా ఆ దృశ్యం   చూస్తుంటే అస్సలు   కాళ్ళు కదలనంటాయి.




ఈ వారం మా పక్కింట్లొ ఉన్న మల్లె చెట్టు  నిండా పూలు పూసాయి  .. మా ఇంటి వరకు వచ్చిన   ఆ వాసనకి మనసు ఊహల్లొ తేలుతుంది ..మల్లె పూలు చూస్తే అమ్మను, చెల్లిని  చూసినంత సంతోషమేస్తుంది.   ఒక్కో పూవు తో ఎన్నెన్ని జ్ఞాపకాలో కదా   .. ఆడపిల్లలకి మనసు దొచుకునె పువ్వులను మించిన నేస్తాలు ఉండవంటె అతిశయొక్తి  కాదు    ..  వాసన తో  మరో లొకం లొ విహరింపచెసే మల్లెలంటె ఇష్టపడని మగువలుండరేమో ! 



 వసంత కాలం లో  ఆరు బయట పూల మొక్కల మద్య కూర్చుని తీయని కోయిల గళాన్ని ఆస్వాదిస్తూ  కుటుంబ సభ్యులతొ   కమ్మని కబుర్లు చెప్పుకుంటె ఎంత బావుంటుందో కదా .