Wednesday, July 29, 2015

వేసవి సెలవులు


వేసవి సెలవులు .. నిండు వేసవి లో కురిసే  తొలకరి జల్లులు ..



పరీక్షలు ఎప్పుడెప్పుడు  అయిపొతాయా .. ఎప్పుడెప్పుడు సెలవులు ఇచ్చేస్తారా .  Hostel  నుండి   ఇంటికి  ఎప్పుడు  వెళ్ళిపోదామా  అని ఎదురు చూసేదాన్ని.  


పుస్తకాలు  ముందేసుకుని  చదువు మధ్యలోసెలవుల్లో ఎమేమి  చేయలా  అని ఊహించుకుంటూ  , పరిసరాలు   మర్చిపొయిన  సందర్భాలు  ఎన్నో :)


వేసవి  సెలవుల్లో, మేడ  పైన పడుకుని , అమ్మ, నాన్న , చెల్లి , తమ్ముడి   తో    కబుర్లు.. నాన్న అడిగే చిక్కు ముడులకు సమాధానాలు  అలొచిస్తూ .. అకాశం లొ చుక్కలు చూస్తూ పడుకోవటం ..   ఎంత  మధురమైన జ్ఞాపకమో   


సెలవులు అనగానే మొదటగా    గుర్తొచ్చేది     అమ్మమ్మ  వాళ్ళ  ఇంట్లో  గడిపిన   రోజులు ,  cousins తో  కలిసి శివ చింతకాయలు  కోయటం, జామ  చెట్లెక్కడం.  మావయ్య   వాళ్ళ పాత   Tractor parts  ఇనుప సామాను వాడికిచ్చి    మామిడి  పళ్ళు  కొనటం.


ఇక  చెల్లి, తమ్ముడు ,  cousins, చిన్న నాటి  స్నేహితులతో  ఆడిన ఆటలు   .. నాలుగు రాళ్ళ  ఆట, దాగుడు మూతలు,  కోతి కొమ్మచ్చి  ,  తొక్కుడు  బిళ్ళ , కచ్చ కాయలు ,  వామన గుంతలు .. అష్టా చమ్మా  , పాము నిచ్చెన,  carroms..  అమ్మమ్మా వాళ్ళ ఇంటి దగ్గర గుడి ప్రాంగణంలో చింత చెట్టు కింద ఆటలు .. నిజంగా  మరపు రాని జ్ఞాపకాలు  .


అరె! మామిడి పళ్ళు మర్చిపొతె ఎలా  :)  తాటి ముంజలు, మామిడి పళ్ళు, కొబ్బరి బొండాలు    ..  మావయ్య  తోటకి వెళ్ళి  పుచ్చ  కాయలు, కర్బూజ పళ్ళు తినటం.. ఎద్దుల బండి 
లో ప్రయాణం .. 

అమ్మ, అమ్మమ్మ చేసే  పిండి వంటలు .


Project చెరువు   కాలువలో ఈతలు   . తడి  బట్టలు ఆరెవరకు ఎండలో ఆటలు. సాయంకాలం కాకుల్లా మాడిపొయి ఇంటికి వచ్చి అమ్మ చేత తిట్లు .

సాయంత్రం అవ్వగానే మల్లె పూలు , సన్నజాజులు   కోసి దండ అల్లటం.  "నాకు పొడుగు దండ అంటే నాకు" అని తగువులాటలు.

గొరింటాకు రుబ్బి పెట్టుకుని, ఎవరి చేతులు ఎక్కువ ఎర్రగా పండుతాయా అని పోటీలు. 


Ice cream బండి రాగానే పెద్ద సందిగ్ధం  ..Pepsi తినాలా ? లేక సేమియా  ice cream తినాలా లేక కుల్ఫీ నా అని :)

బావి దగ్గర తాబేలుని  ఒక్కసారి చూడటం కోసం ఎదురుచూపులు ..


వానా కాలం మొదలవ్వగానే, కాగితప్పడవలు చేసి పిల్ల కాలవల్లొ వదలటం.


ఆ జ్ఞాపకాలను  వెతుక్కుంటూ  వెళ్ళిన నాకు ఇప్పుడా ఊరు కనిపించటం లేదు. 


ఎక్కడ చూసినా కనిపించే కోళ్ళు , ఆవులు, గేదెలు   ఎటు వెళ్ళాయో? 

ఎటు చూసినా పచ్చగా కనిపిస్తూ .. చల్లని నీడనిచ్చె చింత , వేప చెట్లు ఎమైపొయాయో 
పది అడుగులు వెసే లొపు వంద సార్లు  వినిపించె " ఎలా ఉన్నారు? ", " ఎప్పుడొచ్చారు? "   అని పలకరింపులు ఎమైపొయాయో? 
వర్షం పడగానె  వచ్చే మట్టి వాసన ఎక్కడికెళ్ళిన్దో..

ఇప్పుడు మనుషులకే కాదు , ఊరికి  వృద్ధాప్యం  వచ్చినట్టనిపిస్తుంది  .



 స్వచ్ఛమైన  స్వేచ్ఛ కు చిరునామ అయిన  ఆ బాల్యపు  రోజులు మళ్ళీ వస్తే బావుండనిపిస్తుంది  .