Tuesday, May 17, 2016

ప్రకృతి ..నిత్యనూతనం నీ పరిచయం

ఈ ఉరుకుల పరుగుల రోజువారీ జీవితంలో కాస్త విరామం తీసుకుని , ఈ కాంక్రీట్ జంగల్ నుంచి పారిపోవాలనిపిస్తుంది.. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా పీల్చుకుని పచ్చని ప్రకృతి ఒడిలో వాలిపోవాలనిపిస్తుంది .  కాలాన్ని మర్చిపోయి కలల తీరంలో నిల్చిపొవాలనిపిస్తుంది .   పిల్ల కాలువలో నిలబడి చల్లని నీరు నా పాదాలను తాకుతూ, ఎలా ఉన్నావంటూ పిల్లగాలి నా మేను నిమురుతూ చెప్పె పలకరింపులు..  ఇవన్నిటి మధ్య సాగే ప్రయాణాన్ని ముగించాలంటే మనసంగీకరించదెమో . 

 ఈ కంప్యూటర్లు, సెల్ల్ఫొన్ల   వల్ల మనుషులు ప్రకృతికి దూరం అయిపొతున్నారనిపిస్తుంది..  ముఖ్యంగా పిల్లలు.

మన చిన్నతనంలొ కనీసం సెలవుల్లొ అయినా పచ్చని పంట పొలాల్లో ఒడ్లవెంట తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించేవాల్లము. చెరువులు, కుంటల్లో మునిగితేలటం , ప్రకృతి ప్రసాదితమైన పండ్లు, కాయలు తెంపుకుని తినటం  , ఆ పల్లె అందాలు, పల్లె అనుభూతులు..  ఇవన్నీ  తలుచుకుంటే,  ఇప్పటి  పిల్లలు  ప్రకృతికి  ఎంత  దూరంగా  బ్రతుకుతున్నారో  కదా    అనిపిస్తుంది. కాంక్రీటు అరణ్యాలలో, నిలువెత్తు భవనాలలో, ఎసి తరగతులలో ప్లాస్టిక్ మొక్కల పచ్చదనమే మహాద్భాగ్యంగా బ్రతుకుతున్నారు ఈనాటి పిల్లలు. ప్రకృతిని పుస్తకాలలోనే చూసిన పిల్లలకు ప్రత్యక్షంగా ప్రకృతిని ,వన్యప్రాణిని పరిచయం చేద్దాము,   పర్యావరణ సంబంధ యాత్రలు పిల్లలకు ఎంతో విజ్ఞానాన్ని ఇవ్వడమే కాక తక్షణపరిసరాలతో అనుబంధాన్ని ఏర్పరుస్తాయి. ప్రకృతి నేర్పే పాఠాలు పిల్లల మనోవికాసానికి పునాది వేస్తాయి.  కనీసం నెలలొ ఒకటి రెండు రొజులైనా యాంత్రిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో హాయిగా గడుపుదాము. వారంతం లో షాపింగ్ మాల్ కి వెళ్ళడం కన్నా పచ్చని చెట్లు, కొండల మధ్య ప్రకృతి లొ తిరగటం  మనసుకి,మనషికి రెంటికి మంచిదే కదా....  



No comments:

Post a Comment