Wednesday, March 23, 2016

వచ్చేసిందీ .. వసంత కాలం

Cousin పెళ్ళి కొసం కొద్ది రోజులు India వెళ్ళి  వచ్చేసరికి   మోడు పోయిన మా ఇంటి మందారం మొగ్గలతొ నిండుగా కనిపించింది. ఇలా కొమ్మ కొమ్మ కి పూలు పూసి కళకళలాడుతూ ఉంటే ఎంత సంబరంగా ఉందో!



 ఎక్కడికి వెళ్ళినా దారి వెంట పువ్వులు ఎంత అందంగా కనిపిస్తున్నాయొ . ప్రకృతి తన అందాలతొ  కనులకు విందును కలిగించె ఈ  వసంత కాలం అంటె నాకు ప్రత్యెకమైన అభిమానం . అమెరికా లో వసంత ఋతువు వచ్చింది అంటే చాలు,  చెట్లకి ఆకులు అన్నవి కనపడవు, పువ్వులతొ నిండుగా భలె అందంగా ఉంటాయి. దారి వెంట నడుస్తుంటె పూలవాసన ని మోసుకుంటూ వచ్చే  గాలి, పక్షుల కిల కిలా రావాలు  మనస్సుకు మైమరుపు కలిగిస్తాయి   . పొద్దున్నె మా ఇంటి కిటికీ దగ్గర నిలబడి  , అందమైన సుర్యొదయం , పూల మొక్కలు , పక్షులు .. అందమైనా ఆ దృశ్యం   చూస్తుంటే అస్సలు   కాళ్ళు కదలనంటాయి.




ఈ వారం మా పక్కింట్లొ ఉన్న మల్లె చెట్టు  నిండా పూలు పూసాయి  .. మా ఇంటి వరకు వచ్చిన   ఆ వాసనకి మనసు ఊహల్లొ తేలుతుంది ..మల్లె పూలు చూస్తే అమ్మను, చెల్లిని  చూసినంత సంతోషమేస్తుంది.   ఒక్కో పూవు తో ఎన్నెన్ని జ్ఞాపకాలో కదా   .. ఆడపిల్లలకి మనసు దొచుకునె పువ్వులను మించిన నేస్తాలు ఉండవంటె అతిశయొక్తి  కాదు    ..  వాసన తో  మరో లొకం లొ విహరింపచెసే మల్లెలంటె ఇష్టపడని మగువలుండరేమో ! 



 వసంత కాలం లో  ఆరు బయట పూల మొక్కల మద్య కూర్చుని తీయని కోయిల గళాన్ని ఆస్వాదిస్తూ  కుటుంబ సభ్యులతొ   కమ్మని కబుర్లు చెప్పుకుంటె ఎంత బావుంటుందో కదా .  

1 comment: