Tuesday, July 9, 2013

జాబిల్లీ

కదిలే మేఘం నేనై కాపలాగా ఉంటా 
చీకటి గా నే మారి నిన్ను గెలిపిస్తా 
జాబిల్లీ .. నీకై నేనంతమైపోతా 
జాలి తో నా పై నీ వెన్నెల కురిపిస్తావా 



Tuesday, May 28, 2013

అపురూపం

ముద్దొచ్చే  నాసిక  పై  చిన్ని  నొక్కే  అపురూపం
 అమాయకపు  కన్నుల్లో  ఆశ్చర్యమే  అపురూపం
 కురుల  సిరులలో  విరబూసిన  గులాబీ  అపురూపం
 అరవిప్పారిన  పెదవుల  పై చిరునవ్వే  అపురూపం
  చెక్కిలి  పై జాలువారే తొలి  సిగ్గే  అపురూపం
 నన్నలరించే  నా  చెలి  పిలుపు  లో నా పేరే  నాకు  అపురూపం


Monday, May 13, 2013

నిన్ను చేరాలని

నీవే ఒక సంద్రానివి అయితే
కెరటంలా నిన్ను చేరాలని ఉంది


నీవే ఆకాశమైతే జాబిల్లి లా
నీలో ఒదిగిపోవాలని ఉంది


నీవే మేఘానివి అయితే
చిరుగాలిలా నిన్ను తాకాలనిపిస్తుంది



Monday, May 6, 2013

ఋతువులు


పల్లవించే కొత్త కోరిక
పరిమళించే
వసంతం !

కోరికల సాంద్రతలో
రగిలిన ఆవేశం
గ్రీష్మం!

యోచనలో చల్లనైన
ఆవేశం సత్ఫలితం
వర్షం!

సత్ఫలితాల హర్షంలో
సంతృప్తి వెన్నెల
శరత్!

జీవ వెన్నెల వన్నెల
ప్రణాళికా గీతం
హేమంతం!


పండిన చెడు తలపులు
ఎండి మోడువారే
శిశిరం!



Monday, April 29, 2013

విరహం ..

వెన్నెలనూ
చంద్రుడినీ
వేరు చేసి హర్షిస్తుంది
విరహం ....


నీవు నా యెదలో
నింపిన  సంగీతాన్ని
నిర్దయతో మింగుతుంది
నిశబ్దం ....



Monday, April 22, 2013

నవ్వులే నవ్వులు -2


ఏవండోయ్... ఈ రోజు మన పెళ్లై  సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం" చెప్పింది సుగుణ.

"ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?" పెదవి విరుస్తూ అన్నాడు ప్రదీప్.

-----------------------------------------------------------------------------------
డాక్టర్ గారూ... ఈ మధ్య సరిగా నిద్ర పట్టడం లేదు. మంచి మందులేమైనా..." అడిగాడు శ్రీధర్.

"చూడండి.. నిద్ర పట్టడానికి మంచి వాతావరణం అవసరం. చక్కని మెత్తటి పరుపు, ఎత్తైన దిండ్లు, సుగంధభరితమైన్ అగరుబత్తి పొగలు, నీలంరంగు కాంతి బల్బు, కిటికీలకు మంచి కర్టెన్లు వేసుకుంటే నిద్ర దానంతట అదే వస్తుంది" చెప్పాడు డాక్టర్.

" కానీ ఆఫీసులో ఇన్ని వసతులు ఏర్పాటు చేసుకోవడానికి వీలు కాదేమో డాక్టర్..."సందేహం వెలిబుచ్చాడు శ్రీధర్.

-----------------------------------------------------------------------------------
నాకు చాలాకాలంపాటు బతకాలని ఉంది డాక్టర్. ఏమైనా హెల్త్ టిప్స్ చెబుతారా?" అడిగాడు రాము

"పెళ్ళి చేసుకోండి" సలహా ఇచ్చాడు డాక్టర్.
"అలాగైతే ఎక్కువ కాలం బతుకుతారా?" ఆశ్చర్యపోయాడు రాము.
"అదేం లేదులే. కాకపోతే అప్పుడు కాలం భారంగా గడుస్తూ ఎక్కువ కాలం బతికినట్టు అనిపిస్తుంది" అసలు సంగతి చెప్పాడు డాక్టర్.
-----------------------------------------------------------------------------------
రామారావు ప్రతి రోజూ బార్‍కెళ్ళి మందు తాగుతాడు. విషయం ఏమిటంటే ప్రతీ రోజూ రెండు గ్లాసులు ఆర్డర్ చేసి పక్క పక్కనే పెట్టుకుని, ఒక్ సిప్పు ఒక గ్లాసులోంచి ,మరీ సిప్పు రెండో గ్లాసులోంచి తాగుతాడు. ఈ తతంగం అంతా చాలా రోజుల నుంచి చూసిన సర్వర్ ఆనందం ఉండబట్టలేక ఒక రోజు రామారావుని అడిగేశాడు.

"నేను ఎప్పుడూ మందు నా స్నేహితుడు సుబ్బారావుతో కలిసి  తాగేవాడిని. ప్రమాదవశాత్తు అతను చనిపోయాడు. అతని జ్ఞాపకార్ధం ఈ విధంగా ఎప్పుడూ రెండు గ్లాసులు తాగుతున్నాను" చెప్పాడు రామారావు.

కొంతకాలం తరువాత రోజూ ఒక గ్లాసు మాత్రమే ఆర్డరు చెయ్యటం మొదలుపెట్టాడు రామారావు. ఈ విషయం గమనించిన సర్వర్ రామారావుని అడిగాడు "ఏంటి సార్ మీ స్నేహితుడిని పూర్తిగా మర్చిపోయారా?"

"లేదయ్యా నేను మందు మానేశాను" చెప్పాడు రామారావు.

-----------------------------------------------------------------------------------
రాధా....రాధా... వెంటనే మీ అమ్మగారిని గదిలోకి వెళ్ళి గంటదాకా బయటకు రావద్దని చెప్పు మా ఆఫీసరొస్తున్నారు" కంగారుగా అన్నాడు కృష్ణ.

"మీ ఆఫీసరుగారొస్తే మా అమ్మకేం భయమండీ?" అయోమయంగా అన్నది రాధ.

"అబ్బా... నీకు తెలియదు. మా అత్తగారు చనిపోయారని చెప్పి మొన్నటినుంచి సెలవులో ఉన్నాను" విషయం చెప్పాడు కృష్ణ.

-----------------------------------------------------------------------------------
చూడండి మిస్.. చాలా లేటెస్ట్ టైట్స్. జపాన్ నుంచి తెప్పించాం. ఇవి వేసుకున్నారంటే blood circulation దెబ్బకు పెరుగుతుంది" డ్రెస్సులు చూపిస్తూ షాపతను కవితతో చెప్పాడు.


"వీటిని ధరిస్తే blood circulation ఎలా పెరుగుతుంది" ఆశ్చర్యంగా అన్నది కవిత.


"మీది కాదు మిస్. మీరు చదివే కాలేజీలోని కుర్రాళ్ళది" చెప్పాడు షాపత
ను

-----------------------------------------------------------------------------------
నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు
"అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి.
"మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు

"మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి.
-----------------------------------------------------------------------------------
ఇద్దరు స్నెహితులు పందెం పెట్టుకొని టెన్నిస్ ఆడుతున్నారు. ఆట చివరికొచ్చాక బంతి కనిపించకుండా పోయింది. కాసేపు వెతికాక- "బాల్ లేదు కాబట్టి ఆట క్యాన్సిల్" ఓడిపోయేట్టున్న రాము.

"ఇదిగో దొరికింది" తన జేబులో బంతిని పడేసి అరిచాడు సోము.
"బోడి యాభై రూపాయల కోసం నన్ను మోసం చేస్తావా?"

"నిజంరా నాకు దొరికింది"
"ఎలా దొరుకుతుంది? నేను దానిమీద నిల్చుంటే?"

-----------------------------------------------------------------------------------

నువ్వు మన పొరిగింటాయనతో అంత కేర్ ఫ్రీగా మాట్లాడటం నాకు నచ్చడం లేదు" కోపంగా అన్నడు సుధాకర్ భార్యతో.

"ఏం? మీరు మాత్రం ఆయనతో ఆయన భార్యతో అంత ఫ్రీగా మాట్లాడటం లేదూ?" అన్నది భార్య.

"నాకేం? నేను మగాణ్ణి"

"మరి ఆయన మాత్రం మగాడు కాదూ?" అన్నది భార్య.

-----------------------------------------------------------------------------------

Monday, April 15, 2013

నవ్వులే నవ్వులు


సోమవారం ఉదయం అంటేనే ఏంటో చెప్పలేని దిగులు  వచ్చేస్తుంది నాకు . దిగాలుగా ఉన్న మీ సోమవారం కాస్త నవ్వుల మయం చేయాలనీ నాకు నచ్చిన కొన్ని జోకులు మీకోసం ... 




వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.
"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.
----------------------------------------------------------------------------------

నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని.

"వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి.

"ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా.
----------------------------------------------------------------------------------

పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం

"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు
----------------------------------------------------------------------------------

మా నాన్నగారి death certificate submit చేస్తే కానీ మా అమ్మకు pension ఇవ్వరట. అదేదో ఇచ్చి పుణ్యం కట్టుకోండి డాక్టర్ గారు.

"ఓ.. అలాగా... దానికేం భాగ్యం.... ఇంతకీ మీ నాన్న గార్ని treat చేసిన డాక్టరెవరు?
"ఆయన అదృష్టవంతులండి.. ఏ డాక్టర్ treat చెయ్యలేదండీ... ఆయనంతట ఆయనే పోయారు...."
----------------------------------------------------------------------------------
రావయ్యా చంద్రం! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు" అన్నాడు డాక్టర్ సుందర్.
"ఎందుకండీ?" అన్నాడు చంద్రం.
"ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు bounce అయిందట" అన్నాడు డాక్టర్.
"మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది" బదులిచ్చాడు చంద్రం.
----------------------------------------------------------------------------------

డాక్టర్ ప్రకాశ్ దగ్గర ట్రీట్‍మెంట్ తీసుకుంటున్నాడు గోపాల్.

"మీరు నేను గాఢమైన మిత్రులం. ఫీజిచ్చి ఓ మంచి స్నేహితుణ్ణి అవమానించలేను. ఫ్రీగా సేవ చేయించుకోవడమూ ఇష్టం లేదు. కాబట్టి మీకు ఎంతో కొంత అందేలా నా వీలునామాలో మార్పులు చేస్తా" చెప్పాడు గోపాల్.
"డబ్బు కాస్త త్వరగా అవసరం. ఓసారి ఆ ప్రిస్ర్కిప్షన్ ఇస్తారా? నేను కొద్దిగా మార్పులు చేస్తా" అన్నాడు డాక్టర్ ప్రకాశ్.
----------------------------------------------------------------------------------

టర్కీ వాళ్ళని టర్క్స్ అని పిలుస్తారు. మరి జర్మనీ వాళ్ళనూ..." పాఠం చెబుతోంది టీచర్.

"నాకు తెలుసు టీచర్" చెప్పాడు బంటీ

"ఏమంటారు"

"జెర్మ్స్" జవాబిచ్చాడు బంటీ
----------------------------------------------------------------------------------

9"న్యూటన తల మీద ఆపిల్ పడి భూమ్యాకర్షణ శక్తిని కనుక్కోవడం వల్ల మనం బతికిపోయాం కదమ్మా" స్కూల్లో పాఠం విని వచ్చాక తల్లితో చెప్పడు బంటీ.

"అదేంట్రా? " అడిగింది తల్లి.

"నాన్నది బెల్టుల బిజినెస్ కదా. మరి భూమ్యాకర్షణ లేకపోతే వాటినెవరు కొంటారు" వివరించాడు బంటీ.
----------------------------------------------------------------------------------

అత్తగారింటికి వెళ్తున్నది కూతురు. జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి.

"చూడమ్మా... ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు తిను" చివరి జాగ్రత్తగా చెప్పింది.


"ఓహో! అందులో ఏవైనా హానికర పదార్థాలేమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అంతేనా మమ్మీ" అన్నది ఆధునికతరం యువతి.






Monday, April 8, 2013

వర్షంలో కారేసుకుని

వర్షంలో కారేసుకుని షికారుకెల్లాలని ,
అందమైన గులాభి రెక్కలపై చివర్లో మిగిలిన ముత్యాల్లాంటి 
వర్షపు చినుకులను నాలుక చివరతో ఆస్వాదించాలని ,
కాలివేళ్ల మధ్య నుంచి జాలువారే వర్షపు నీటి 
పిల్లకాలువలకు బుల్లి బుల్లి కట్టలేయాలని ,
సముద్రపు ఒడ్డున గూళ్ళు కట్టుకుని 
వాటిలో పాదాలు దూర్చాలని ,
వానే వరదయి వర్షించే వేళ 
ఎవరు చూడని ఏకాంత ప్రదేశాలకెళ్ళి 
వర్షంలో తడిసిపోవాలని 





Monday, April 1, 2013

ఉడతకి ఒకటి , బుడతకి ఒకటి

రోజు సాయంత్రం కాగానే , వేద నేను కలిసి కాసేపు తెలుగు Rhymes పాడుకుంటాము . కానీ రోజు పాడి పాడి చిట్టి చిలకమ్మా,  గుమ్మాడమ్మా  గుమ్మాడి  ఇంకా Youtube లో ఉన్న పాటలన్నీ వేద కి bore కొట్టేసాయి.  అందుకే  వేద  కోసం ఒక కొత్త పాట ... 

నాన్న తెచ్చెను పలకలు రెండు 
ఉడతకి ఒకటి , బుడతకి ఒకటి 

మామ తెచ్చెను బొమ్మలు నాలుగు 
ఉడతకి రెండు  , బుడతకి రెండు 

తాత తెచ్చెను పండ్లు ఆరు 
ఉడతకి మూడు బుడతకి మూడు 

అమ్మ చేసెను గారెలు చాలా 
ఉడతకి కొన్ని మరి  బుడతకి ఎన్ని ??







Tuesday, March 26, 2013

పుట్టిన రోజు వేడుక విశేషాలు

వేద రెండవ పుట్టిన రోజు వేడుక విశేషాలు రాయాలని 10 రోజుల నుండి అనుకుంటుంటే .. ఈ రోజుకి కాస్త తీరిక  దొరికి ఇలా పుట్టిన రోజు వేడుక విశేషాలు, ఫోటోలతో వచ్చేసాను. వేద  పుట్టిన రోజు మార్చ్ 15 అయినప్పటికీ  శుక్రవారం అవ్వటం తో మార్చ్ 16, శనివారం బంధు , మిత్రుల సమక్షం లో వేడుక చేసుకున్నాము. 

మేము  పుట్టిన రోజు కోసం బాడుగ తీసుకున్న గది మా ఇంటికి చాల దూరం ఉండటం తో ఉదయాన్నే నేను, రాజీవ్ ఇద్దరు స్నేహితులతో కలిసి హాల్ decorate చేయటానికి బయల్దేరాము . స్నేహితుల సహాయం తో 11 కల్లా  అలంకరణ పూర్తి అయ్యింది . వేద కి సీతకోకచిలక అంటే చాల ఇష్టం. అందుకే party కోసం  butterfly theme ఎంచుకున్నాను. 11:45 కల్లా  Photographer  వచ్చేసింది . magician చివరి నిమిషం లో phone  చేసి, ఆరోగ్యం బాలేదు, రావటం లేదు అని చెప్పేసరికి చాల disappoint అయ్యాను :( . అతిధులు కాస్త ఆలస్యంగా రావటంతో party కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాము. మొత్తానికి బంధు మిత్రువుల మధ్య, పిల్లల హడావిడితో వేద పుట్టిన రోజు వేడుక చాలా సందడి గా  జరిగింది. 

వేద  పుట్టిన రోజు వేడుక ఇంత ఘనంగా  జరగటానికి సహాయం చేసిన మిత్రులందరికి, పుట్టినరోజు వేడుకకి వచ్చి చిన్నారి తల్లిని దీవించిన బంధు , మిత్రులందరికి నా  ధన్యవాదాలు . 



వేద party hall కి వచ్చేసరికి అక్కడ ఉన్న అతిదులందరినీ చూసి .. ఏమి జరుగుతుంది ఇక్కడ అని confusion :)




Cake cut  చేయటానికి నేను ready .. మరి cake ఎక్కడ ??



Cake కూడా ready 




Happy Birthday to You ...... 






Cake cut చేయటం అయిపోయాక కాసేపు కబుర్లు , తరువాత బోజనాలు 



బోజనాల తరువాత butterfly pinata ని కొట్టటానికి పిల్లలందరూ ready 



10 నిమిషాలు కొట్టాక మొత్తానికి pinata విరిగిపోయింది . 


pinata  లోని chocolates, candy కోసం పిల్లలందరూ పోటి 


party కి వచ్చిన పిల్లలందరి  కోసం return gifts 


అమ్మా అప్పుడే అయిపోయిందా party :)

Thursday, March 14, 2013

చిన్నారి తల్లి కి పుట్టిన రోజు లేఖ



చిట్టి తల్లి  ...  ఎవరని చూస్తున్నావా .. నేనే రా అమ్మని .. 

నీ రెండవ పుట్టిన రోజు  నీకోసం ఒక ఈ లేఖని రాయాలనుకున్నాను .. నాకు తెలుసు నువ్వు అప్పుడే చదవలేవని .. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఈ లేఖని నువ్వు చవినప్పుడు నీకు అర్ధం అవుతుంది నాకు నువ్వంటే ఎంత ఇష్టమో ... 

ఏంటో రోజులు ఎంత తొందరగా గడిచిపోతున్నాయి .. అప్పుడే ఎంత పెద్దదానివైపోయావు   అనిపిస్తుంది .. మొన్నేగా బోర్లా పడ్డావు .. అప్పుడే ఇల్లంతా పరిగెత్తి మమ్మల్ని పరిగెత్తిస్తున్నావు :)

నువ్వు చెప్పే చిన్ని చిన్ని మాటలు , నువ్వు అమ్మ అని  ముద్దుగా పిలవటం .. Hug Me అంటూ వచ్చి నన్ను గట్టిగా  వాటేసుకోవటం  నాకు ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో మాటల్లో చెప్పలేను. 

నువ్వు నిద్రపోతుంటే ప్రశాంతంగా , అమాయకంగా కనిపించే నీ ముఖం ఎంత సేపు చూసినా నాకు తనివి తీరదు. 

నువ్వు నా జీవితం లోకి వచ్చి ఈరోజు కి సరిగ్గా 730 రోజులు . ఈ 730 రోజుల్లో నువ్వు మా మీద చూపించిన ప్రేమ, మాకు కలిగించిన సంతోషం మాటల్లో వెల కట్టలేనిది . 

నీ చిరునవ్వుతో , చిట్టి చిట్టి చేష్టలతో ఎంత బాధలో ఉన్నవారినయినా నవ్వించగలవు .  నువ్వు ఇలాగే ఇంకో 100 సంవత్సరాలు నవ్వుతూ, నీ  పక్కనున్నవారిని నవ్విస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను .. 

 I Love You so much Veda Baby.





బోర్లా పడితే బొబ్బట్లు 

  


నీకు 4 mothns .. తాతయ్య తో షికారు కెల్లటానికి ready



కృష్ణాష్టమి రోజు చిన్ని కృష్ణుడి లా నీ చిరునవ్వులు చూసి ఎంత సంబర పడ్డామో .. 




నీకు సరిగ్గా 6 Months.. కేక్ కట్ చేసి నీకు పెట్టకుండా మేము తినేసాము :)




మొదటి సారి నీకు రెండు పిలకలు వేసి, నేను మురిసిపోయిన రోజు . 




 Halloween 2011



India వెళ్ళినప్పుడు మావయ్య తో ఆడుకుంటూ 




తిరుమల తిరుపతి దేవస్తానం లో తల నీలాలు సమర్పించాక 



చిన్నప్పుడు, ఇప్పుడు కూడా నీళ్ళతో ఆడటం కంటే ఇష్టమైన పని నీకు ఇంకోటి ఉండేది కాదు 



అడుగులకి అరిసెలు 



నీ మొదటి పుట్టినరోజు వేడుక 




Mother's Day రోజు downtown లో  మనం matching matching dress వేసుకుని తిరుగుతూ 




ఈ రోజుకి  నువ్వు మా జీవితాల్లోకి అడుగు పెట్టి  సరిగ్గా 500 రోజులు 



మొదటి రాఖి పండుగ 



కృష్ణాష్టమి 2012



నువ్వు, నేను, నాన్న.. అమ్మమ్మ ని తాతయ్యని తీసుకుని Niagara Falls చూడటానికి వెళ్ళినప్పుడు 




Elevators,  Escalators చూస్తే చాలు పరిగెత్తేదానివి



Chicago River  లో Boat లో నీ 18 Months Birthday



Halloween 2012



Dec 2012 , మావయ్య పెళ్ళిలో 







Monday, March 11, 2013

కాంక్రీటు జంగిల్


కాంక్రీటు జంగిల్ అంటే
పచ్చదనం లోపించిన
భవన సముదాయం అనుకున్నాను
కాదు......
సహజానుభూతులు కోల్పోయి
జీవం ఘనీభవించిన
మనుష్యుల హృదయాలు ...




Wednesday, March 6, 2013

నవ్వుకోండి కాసేపు

ఈ రోజు నా స్నేహితురాలు పంపించిన ఈ టపా చూసి నవ్వాపుకోలేక పోయానంటే నమ్మండి .. 
మరి మీరు కూడా కాసేపు నవ్వుకోండి :)



These are from a book called Disorder in the Courts of America , and are things attorneys actually said in court, word for word, taken down and now published by court reporters ,who had to suffer from the torment of staying calm while these exchanges were actually taking place.


ATTORNEY: Now doctor, isn't it true that when a person dies in his sleep, he doesn't know about it until the next morning?
WITNESS:
Did you actually pass the bar exam?

________________________________________

ATTORNEY:
Were you present when your picture was taken?
WITNESS:
Would you repeat the question?

______________________________________


ATTORNEY:
She had three children, right?
WITNESS:
Yes.
ATTORNEY:
How many were boys?
WITNESS:
None.
ATTORNEY:
Were there any girls?
______________________________________

ATTORNEY:
How was your first marriage terminated?
WITNESS:
By death.
ATTORNEY:
And by whose death was it terminated?
______________________________________


ATTORNEY:
Can you describe the individual?
WITNESS:
He was about medium height and had a beard.
ATTORNEY:
&! nbsp; Was this a male or a female?
______________________________________

ATTORNEY: Do you recall the time that you examined the body?
WITNESS:
The autopsy started around 8:30 p.m.
ATTORNEY:
And Mr. Denton was dead at the time?
WITNESS:
No, he was sitting on the table wondering why I was doing an autopsy on him!
______________________________________


ATTORNEY:
Doctor, before you performed the autopsy, did you check for a pulse?
WITNESS:
No.
ATTORNEY:
Did you check for blood pressure?
WITNESS:
No.
ATTORNEY:
Did you check for breathing?
WITNESS:
No.
ATTORNEY:
So, then it is possible that the patient was alive when you began the autopsy?
WITNESS:
No.
ATTORNEY:
How can you be so sure, Doctor?
WITNESS:
Because his brain was sitting on my desk in a jar.
ATTORNEY:
But could the patient have still been alive, nevertheless?
WITNESS:
Yes, it is possible that he could have been alive and practising law. 


Monday, February 25, 2013

స్త్రీ

ఏకమై రెండు మనస్సులు 
మూడు ముళ్ళ బంధం తో 
నాలుగు వేదాలు చదివి 
పంచ భూతాల  సాక్షిగా 
అరుంధతి ని చూసి 
ఏడడుగులు వేసి 
ఎనిమిది తొమ్మిది నెలలు మోసి 
పదిలంగా కనేది  స్త్రీ .. 




Saturday, February 23, 2013

ఆనంద భాష్పం


ప్రియా ,

మరు జన్మంటూ ఉండి , 
నీ సఖి గా ఉండే అవకాశం లేకపోతే 
నీ కంట ఆనంద బాష్పాన్నై జన్మించి
నీ చెక్కిలి ఫై జీవించి
నీ అధరాల  ఫై మరణిస్తాను







Thursday, February 21, 2013

నా బాల్యం నాకిచ్చేయ్

ఈ రోజు తెల్లవారు జామున ఒక మంచి కల.. కలలో నా చిన్ననాటి స్నేహితురాలు ఇంద్రరేఖ .. 21 సంవత్సరాలు అవుతుంది తనని చివరిసారి చూసి.   బాల్యం లో మేము చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.  కలలో వచ్చింది కాసేపే అయినా ఉదయం నుండి నా  ఆలోచనలు అన్ని నా  బాల్యం, అప్పుడు చేసిన అల్లరి పనులు, అమ్మ ప్రేమ, బడి ముచ్చట్లు చుట్టే తిరుగుతున్నాయి. నిజంగా ఒక కాల యంత్రం ఉండి మళ్లీ  బాల్యపు రోజులకి వెళితే ఎంత బావుంటుందో కదా ..!

ఉందో లెదో స్వర్గం
...నా పుణ్యం నాకిచ్చెయ్

సర్వస్వం నీకిస్తా
...నా బాల్యం నాకిచ్చేయ్

అమ్మ గుండెలొ దూరి
...అనందంతొ తుల్లి
ఆద మరిచి నిదరోయె
...ఆ సౌఖ్యం నాకిచ్చెయ్

అమ్మ లాలనకు ముందు
...బ్రహ్మ వేదాలు బందు
ముక్తి కేలనె మనసా
...బాల్యం కోసం తప్పస్సు చేయ్





నిన్న ఏదో వెబ్ పత్రిక లో ఈ  కవిత చదివాను. అందుకే ఇలాంటి కల వచ్చిందేమో . అందుకే నా ఈ  రోజు టపా లో మీకోసం ఆ కవిత కూడా .. నాలాగే మీరు కూడా మీ చిన్ననాటి మధుర స్మృతులని గుర్తు తెచ్చుకోండి. 

Saturday, February 16, 2013

ప్రియరాగాలు


ప్రియతమా..
నా  మనసు నీకై ప్రియరాగాలు ఆలపిస్తుంది.
నువ్వు ఎంత దూరంలోనున్నా  నా హృదయ పరిధి దాటిపోలేవు
నీ రూపం నా కన్నులతో చూసి నాలో నిను  పూర్త్తిగా నింపాను 
నా మూగ నవ్వు  నువ్వు  గుర్తించే దేనాడు 
నీ ప్రేమామృత ధారలు  నా పై కురిసే దేనాడు


Friday, February 15, 2013

మనస్సే పాడేనులే


"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు"  సినిమా చూసినప్పటి నుండి, ఆ పాట వినప్పటినుండి ,  చిన్నతనంలో నా స్నేహితుల తో కలిసి  పాడుకున్న ఈ పాట మనస్సులో మెదులుతూనే ఉంది. 


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమొ విరగబూసింది
చెట్టు కదలకుండా కొమ్మ వంచండి
కొమ్మ విరగకుండా పూలు కోయండి
అందులో పూలన్నీ దండ గుచ్చండి
దండ తీసుకెళ్ళి సీతకియ్యండి
దాచుకో సీతమ్మ రాముడంపేడు
దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు
దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ
దాచుకోకుంటేను దోచుకుంటారు