Monday, April 29, 2013

విరహం ..

వెన్నెలనూ
చంద్రుడినీ
వేరు చేసి హర్షిస్తుంది
విరహం ....

నీవు నా యెదలో
నింపిన  సంగీతాన్ని
నిర్దయతో మింగుతుంది
నిశబ్దం ....

Monday, April 22, 2013

నవ్వులే నవ్వులు -2

ఏవండోయ్... ఈ రోజు మన పెళ్లై  సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం" చెప్పింది సుగుణ.

"ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?" పెదవి విరుస్తూ అన్నాడు ప్రదీప్.

-----------------------------------------------------------------------------------
డాక్టర్ గారూ... ఈ మధ్య సరిగా నిద్ర పట్టడం లేదు. మంచి మందులేమైనా..." అడిగాడు శ్రీధర్.

"చూడండి.. నిద్ర పట్టడానికి మంచి వాతావరణం అవసరం. చక్కని మెత్తటి పరుపు, ఎత్తైన దిండ్లు, సుగంధభరితమైన్ అగరుబత్తి పొగలు, నీలంరంగు కాంతి బల్బు, కిటికీలకు మంచి కర్టెన్లు వేసుకుంటే నిద్ర దానంతట అదే వస్తుంది" చెప్పాడు డాక్టర్.

" కానీ ఆఫీసులో ఇన్ని వసతులు ఏర్పాటు చేసుకోవడానికి వీలు కాదేమో డాక్టర్..."సందేహం వెలిబుచ్చాడు శ్రీధర్.

-----------------------------------------------------------------------------------
నాకు చాలాకాలంపాటు బతకాలని ఉంది డాక్టర్. ఏమైనా హెల్త్ టిప్స్ చెబుతారా?" అడిగాడు రాము

"పెళ్ళి చేసుకోండి" సలహా ఇచ్చాడు డాక్టర్.
"అలాగైతే ఎక్కువ కాలం బతుకుతారా?" ఆశ్చర్యపోయాడు రాము.
"అదేం లేదులే. కాకపోతే అప్పుడు కాలం భారంగా గడుస్తూ ఎక్కువ కాలం బతికినట్టు అనిపిస్తుంది" అసలు సంగతి చెప్పాడు డాక్టర్.
-----------------------------------------------------------------------------------
రామారావు ప్రతి రోజూ బార్‍కెళ్ళి మందు తాగుతాడు. విషయం ఏమిటంటే ప్రతీ రోజూ రెండు గ్లాసులు ఆర్డర్ చేసి పక్క పక్కనే పెట్టుకుని, ఒక్ సిప్పు ఒక గ్లాసులోంచి ,మరీ సిప్పు రెండో గ్లాసులోంచి తాగుతాడు. ఈ తతంగం అంతా చాలా రోజుల నుంచి చూసిన సర్వర్ ఆనందం ఉండబట్టలేక ఒక రోజు రామారావుని అడిగేశాడు.

"నేను ఎప్పుడూ మందు నా స్నేహితుడు సుబ్బారావుతో కలిసి  తాగేవాడిని. ప్రమాదవశాత్తు అతను చనిపోయాడు. అతని జ్ఞాపకార్ధం ఈ విధంగా ఎప్పుడూ రెండు గ్లాసులు తాగుతున్నాను" చెప్పాడు రామారావు.

కొంతకాలం తరువాత రోజూ ఒక గ్లాసు మాత్రమే ఆర్డరు చెయ్యటం మొదలుపెట్టాడు రామారావు. ఈ విషయం గమనించిన సర్వర్ రామారావుని అడిగాడు "ఏంటి సార్ మీ స్నేహితుడిని పూర్తిగా మర్చిపోయారా?"

"లేదయ్యా నేను మందు మానేశాను" చెప్పాడు రామారావు.

-----------------------------------------------------------------------------------
రాధా....రాధా... వెంటనే మీ అమ్మగారిని గదిలోకి వెళ్ళి గంటదాకా బయటకు రావద్దని చెప్పు మా ఆఫీసరొస్తున్నారు" కంగారుగా అన్నాడు కృష్ణ.

"మీ ఆఫీసరుగారొస్తే మా అమ్మకేం భయమండీ?" అయోమయంగా అన్నది రాధ.

"అబ్బా... నీకు తెలియదు. మా అత్తగారు చనిపోయారని చెప్పి మొన్నటినుంచి సెలవులో ఉన్నాను" విషయం చెప్పాడు కృష్ణ.

-----------------------------------------------------------------------------------
చూడండి మిస్.. చాలా లేటెస్ట్ టైట్స్. జపాన్ నుంచి తెప్పించాం. ఇవి వేసుకున్నారంటే blood circulation దెబ్బకు పెరుగుతుంది" డ్రెస్సులు చూపిస్తూ షాపతను కవితతో చెప్పాడు.

"వీటిని ధరిస్తే blood circulation ఎలా పెరుగుతుంది" ఆశ్చర్యంగా అన్నది కవిత.

"మీది కాదు మిస్. మీరు చదివే కాలేజీలోని కుర్రాళ్ళది" చెప్పాడు షాపత
ను

-----------------------------------------------------------------------------------
నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు
"అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి.
"మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు

"మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి.
-----------------------------------------------------------------------------------
ఇద్దరు స్నెహితులు పందెం పెట్టుకొని టెన్నిస్ ఆడుతున్నారు. ఆట చివరికొచ్చాక బంతి కనిపించకుండా పోయింది. కాసేపు వెతికాక- "బాల్ లేదు కాబట్టి ఆట క్యాన్సిల్" ఓడిపోయేట్టున్న రాము.

"ఇదిగో దొరికింది" తన జేబులో బంతిని పడేసి అరిచాడు సోము.
"బోడి యాభై రూపాయల కోసం నన్ను మోసం చేస్తావా?"

"నిజంరా నాకు దొరికింది"
"ఎలా దొరుకుతుంది? నేను దానిమీద నిల్చుంటే?"

-----------------------------------------------------------------------------------

నువ్వు మన పొరిగింటాయనతో అంత కేర్ ఫ్రీగా మాట్లాడటం నాకు నచ్చడం లేదు" కోపంగా అన్నడు సుధాకర్ భార్యతో.

"ఏం? మీరు మాత్రం ఆయనతో ఆయన భార్యతో అంత ఫ్రీగా మాట్లాడటం లేదూ?" అన్నది భార్య.

"నాకేం? నేను మగాణ్ణి"

"మరి ఆయన మాత్రం మగాడు కాదూ?" అన్నది భార్య.

-----------------------------------------------------------------------------------

Monday, April 15, 2013

నవ్వులే నవ్వులు

సోమవారం ఉదయం అంటేనే ఏంటో చెప్పలేని దిగులు  వచ్చేస్తుంది నాకు . దిగాలుగా ఉన్న మీ సోమవారం కాస్త నవ్వుల మయం చేయాలనీ నాకు నచ్చిన కొన్ని జోకులు మీకోసం ... 

వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.
"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.
----------------------------------------------------------------------------------

నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని.

"వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి.

"ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా.
----------------------------------------------------------------------------------

పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం

"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు
----------------------------------------------------------------------------------

మా నాన్నగారి death certificate submit చేస్తే కానీ మా అమ్మకు pension ఇవ్వరట. అదేదో ఇచ్చి పుణ్యం కట్టుకోండి డాక్టర్ గారు.

"ఓ.. అలాగా... దానికేం భాగ్యం.... ఇంతకీ మీ నాన్న గార్ని treat చేసిన డాక్టరెవరు?
"ఆయన అదృష్టవంతులండి.. ఏ డాక్టర్ treat చెయ్యలేదండీ... ఆయనంతట ఆయనే పోయారు...."
----------------------------------------------------------------------------------
రావయ్యా చంద్రం! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు" అన్నాడు డాక్టర్ సుందర్.
"ఎందుకండీ?" అన్నాడు చంద్రం.
"ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు bounce అయిందట" అన్నాడు డాక్టర్.
"మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది" బదులిచ్చాడు చంద్రం.
----------------------------------------------------------------------------------

డాక్టర్ ప్రకాశ్ దగ్గర ట్రీట్‍మెంట్ తీసుకుంటున్నాడు గోపాల్.

"మీరు నేను గాఢమైన మిత్రులం. ఫీజిచ్చి ఓ మంచి స్నేహితుణ్ణి అవమానించలేను. ఫ్రీగా సేవ చేయించుకోవడమూ ఇష్టం లేదు. కాబట్టి మీకు ఎంతో కొంత అందేలా నా వీలునామాలో మార్పులు చేస్తా" చెప్పాడు గోపాల్.
"డబ్బు కాస్త త్వరగా అవసరం. ఓసారి ఆ ప్రిస్ర్కిప్షన్ ఇస్తారా? నేను కొద్దిగా మార్పులు చేస్తా" అన్నాడు డాక్టర్ ప్రకాశ్.
----------------------------------------------------------------------------------

టర్కీ వాళ్ళని టర్క్స్ అని పిలుస్తారు. మరి జర్మనీ వాళ్ళనూ..." పాఠం చెబుతోంది టీచర్.

"నాకు తెలుసు టీచర్" చెప్పాడు బంటీ

"ఏమంటారు"

"జెర్మ్స్" జవాబిచ్చాడు బంటీ
----------------------------------------------------------------------------------

9"న్యూటన తల మీద ఆపిల్ పడి భూమ్యాకర్షణ శక్తిని కనుక్కోవడం వల్ల మనం బతికిపోయాం కదమ్మా" స్కూల్లో పాఠం విని వచ్చాక తల్లితో చెప్పడు బంటీ.

"అదేంట్రా? " అడిగింది తల్లి.

"నాన్నది బెల్టుల బిజినెస్ కదా. మరి భూమ్యాకర్షణ లేకపోతే వాటినెవరు కొంటారు" వివరించాడు బంటీ.
----------------------------------------------------------------------------------

అత్తగారింటికి వెళ్తున్నది కూతురు. జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి.

"చూడమ్మా... ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు తిను" చివరి జాగ్రత్తగా చెప్పింది.

"ఓహో! అందులో ఏవైనా హానికర పదార్థాలేమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అంతేనా మమ్మీ" అన్నది ఆధునికతరం యువతి.

Monday, April 8, 2013

వర్షంలో కారేసుకుని

వర్షంలో కారేసుకుని షికారుకెల్లాలని ,
అందమైన గులాభి రెక్కలపై చివర్లో మిగిలిన ముత్యాల్లాంటి 
వర్షపు చినుకులను నాలుక చివరతో ఆస్వాదించాలని ,
కాలివేళ్ల మధ్య నుంచి జాలువారే వర్షపు నీటి 
పిల్లకాలువలకు బుల్లి బుల్లి కట్టలేయాలని ,
సముద్రపు ఒడ్డున గూళ్ళు కట్టుకుని 
వాటిలో పాదాలు దూర్చాలని ,
వానే వరదయి వర్షించే వేళ 
ఎవరు చూడని ఏకాంత ప్రదేశాలకెళ్ళి 
వర్షంలో తడిసిపోవాలని 

Monday, April 1, 2013

ఉడతకి ఒకటి , బుడతకి ఒకటి

రోజు సాయంత్రం కాగానే , వేద నేను కలిసి కాసేపు తెలుగు Rhymes పాడుకుంటాము . కానీ రోజు పాడి పాడి చిట్టి చిలకమ్మా,  గుమ్మాడమ్మా  గుమ్మాడి  ఇంకా Youtube లో ఉన్న పాటలన్నీ వేద కి bore కొట్టేసాయి.  అందుకే  వేద  కోసం ఒక కొత్త పాట ... 

నాన్న తెచ్చెను పలకలు రెండు 
ఉడతకి ఒకటి , బుడతకి ఒకటి 

మామ తెచ్చెను బొమ్మలు నాలుగు 
ఉడతకి రెండు  , బుడతకి రెండు 

తాత తెచ్చెను పండ్లు ఆరు 
ఉడతకి మూడు బుడతకి మూడు 

అమ్మ చేసెను గారెలు చాలా 
ఉడతకి కొన్ని మరి  బుడతకి ఎన్ని ??