Tuesday, October 8, 2019

అమ్మమ్మ ఊరు... దసరా పండుగ

ఉదయం 9 కావొస్తుంది. రైలు లొ officeకి వెళ్తూ facebook open చేయగానే   friends post  చేసిన  బతుకమ్మ photos చూసి నా ఆలోచనలు గతంలోకి   పరుగులు తీయటం మొదలు పెట్టాయి.
ఇప్పుడంటే ఎక్కువ excitement  లేదు కాని చిన్నప్పుడు దసరా వస్తుందంటే ఎన్ని రోజుల ముందు నుండి ఎదురుచూసే వాళ్ళమో.
ఇంకా చెప్పాలంటే దసరా కూడా కాదు మాకు  బతుకమ్మ రోజే పెద్ద పండగ.  ఏ పండగకి ఎక్కడ ఉన్నా  దసరా కి మాత్రం అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళాల్సిందే.

అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తుంటే దారి పొడవునా పచ్చటి పొలాలు , ఎడ్లబండ్ల మీద వెళ్తున్న   రైతులు ఎదురుపడేవారు. ఊరు దగ్గర పడుతోందనటానికి గుర్తుగా రోడ్డు పక్కనే ఉన్న అంబేత్కర్, గాంధీ తాత  నాయకుల విగ్రహాలు కనిపిస్తూ ఉండేవి.అవి దాటిన తరువాత అమ్మ చదువుకున్న గవర్నమెంటు స్కూల్ యిప్పటికీ  చెక్కు చెదరకుండా అలానే ఉంది. 
ఇంట్లొకి వెళ్లగానే ఆప్యాయంగా  పలకరింపులు , ఇంటి నిండా బందువులు,కుంకుడు కాయ స్నానాలు, కొత్త బట్టలు, గోరింటాకు సరదాలు, పండుగ రోజు సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూడటం. ఎన్ని మరుపు రాని జ్ఞాపకాలో.       

వారం  ముందు నుండే పెద్ద బతుకమ్మ రోజు కి కావాల్సిన పూలు సేకరించడం మొదలయ్యేది. గునుగు పూలు లాంటివి ముందే తీసుకొచ్చి , జాగ్రత్తగా ఒకే సైజులో కత్తిరించి, వాటికి రంగులు వేసి  కట్టలుగా చేసి పెట్టెవాళ్ళు.  
పండుగ రోజు ప్రొద్దున్నే లేచి cousins తొ  కలిసి గుమ్మడి పూల కొసం ఇంటి చుట్టూ, పక్కనే ఉన్న తోటలో వెతికే   వాళ్లం.  మళ్ళీ లేట్ గా లేస్తే ఎవరో ఒకరు ఆ పూలు కోసుకెళ్తారు.  
 తోటలొకి వెళ్లి   బస్తాల కొద్ది తంగెడు పూవు తెచ్చి, పొద్దున్నె బతుకమ్మ పేరుస్తుంటె  పిల్లలం అంతా సహయం చెసేవాళ్లం.

సాయంత్రం   కాగానే  అందరం  ready అయ్యి బతుకమ్మలతొ  ఊరి చివర చెరువు దగ్గరికి వెళ్లేవాళ్లం. దారి పొడుగునా , ఎవరి బతుకమ్మ బావుంది    అని చూడటం , అందరితొ    కబుర్లు  భలే  సరదాగ  ఉండేది .  

 చీకటి పడే వరకు ఆడి,  బోలెడు బతుకమ్మ   పాటలు పాడి/విని   ఊరి చివర ఉన్న చెరువులో అన్ని బతుకమ్మలు వేసి , ఇంటికి వచ్చెసరికి రాత్రి అయిపొయెది.  బతుకమ్మ పండగ అయిపొయింది అని దిగులు ఉన్నా, తెళ్లారితే దసరా  అనే సంతొషం.   

మేము లేచెసరికి పెద్దవాళ్లు   బొలెడన్ని పిండి వంటలు చేసెవారు.       జమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకొవటం, నీలి రంగులొ ఏ పక్షి కనిపించినా పాలపిట్ట  అనుకొవటం,  అందరం కలిసి కూర్చుని బోజనాలు ఎన్ని జ్ఞాపకాలొ. 

station వచ్చేసింది  అన్న announcement తొ ఉలిక్కి పడిన నేను బాగ్  తీసుకుని   హడావిడిగా రైలు దిగి , మళ్లి పండుగ కి అమ్మమ్మ  వాల్లింటికి   ఎప్పటికి వెళ్తానొ   అని ఆలోచిస్తూ దిగాలుగా office వైపు అడుగులేశాను.  

 దసరా పండుగలో అప్పటికి ఇప్పటికి ఎంతో  మార్పువచ్చింది, కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం అలాగే ఎంతో మధురంగా ఉన్నాయి. 



Image may contain: 2 people, including Jyothi Peddireddy



Thursday, November 15, 2018

తోడు

జీవితంలో కొన్ని జ్ఞాపకాలను 
మరిచిపొతే కాని బ్రతకలేము 
కొన్ని గాయాలను
గుర్తుంచుకుంటే కాని ఎదగలేము

బాగుండటం అంటే 

బాధలు లేకుండా  ఉండటం కాదు
ఎన్ని బాధలు ఉన్నా   
అవి చెప్పుకొవటానికి ఒక తోడు ఉండటం

Thursday, February 15, 2018

వీడ్కోలు


తాతయ్యా..
మీరలా వున్నపళంగా   
వీడ్కోలు చెప్పేస్తూ వెళ్ళిపోయారు.

కారు దిగగానే  గేటు , కాగితప్పూలు   
చెప్పే స్వాగతం లొ ఎదో  లోపం కనిపిస్తుంది


లోపలికి వచ్చి తాళం తీస్తుంటే
ఇంటి గుమ్మానికతికించిన మీ చిరునవ్వు 
చిన్నగా ఆప్యాయంగా పలకరిస్తుంది

తలుపు తోసి లోపలికి వచ్చేస్తే
ఇల్లంతా చిందరవందరగా జ్ఞాపకాలు..

మడత కుర్చీ  బోసిగా
మీరు లేరు అని గుర్తు చేస్తుంది 

మీరు ప్రేమగా చూసుకునే మొక్కలన్ని
మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాయి 

మీ మాటలతో , రేడియోలో పాటలతో
సందడి గా ఉండే 
ఇల్లంతా ఇప్పుడు  మౌనం రాజ్యమేలుతోంది   



Friday, October 6, 2017

ఋతుగీతం..


ఏకాంత ప్రవాసాలే
ఎదురీదిన హృదయంలొ.. 
వేదాంత విచారాలే 
నెమరేసిన సూత్రంలా .. 
ఒక చాయా మాత్రంగా..  
అనంతాఅనంద సిరిలా..   

చిగురేసిన స్వప్నం లా 
ఒక మౌనం సాక్షంగా
విరబూసిన సత్యం లా 
ఒక స్నేహ విపంచికలా 

ఆది అంతం లేని 
కవనగమన కల్పనగా.. 
కదిలే కథలకు నిలయం 
కలకాలం ఋతురాగం..      
తరలే మమతల డొలా
అనుభూతుల ఋతుగీతం..        

Sunday, May 28, 2017

ఒంటరి నా నేను ..?

నిత్యం
నీ ప్రేమ ధ్యానం లో , నీతో సహజీవనం 
చేస్తున్న నా హృదయానికి ఒంటరితనమెక్కడిది...?

ఎంత దూరాన వున్నా ..
ఉదయకాంతిలా ప్రసరిస్తూ,జీవనదిలా ప్రవహిస్తూ
చైతన్యం చేరవేస్తూ, నన్ను  జాగృత పరుస్తూ 
నిత్యసంతోషాన్ని  అందిస్తున్న నువ్వు ఉండగా
నేను ఒంటరినెలా అవుతాను..?

నిత్యం నా పై  ప్రేమ వెన్నెల జాలువార్చే
పున్నమి జాబిలి వుండగా,
క్షణమైనా నను వీడని నీ తలపులు నాతొ ఉండగా  
నాకు ఒంటరితనమెక్కడిది? 


Thursday, May 11, 2017

అలసిపోయాను నిరాశలో....

అలసిపోయాను నిరాశలో....
నిన్ను వద్దనుకున్న ప్రతిసారీ, వెళ్లలేకపొతున్నందుకు   
నీ మీద కోపం వచ్చినా, ప్రేమ చూపించాల్సి వచ్చినప్పుడు    
నిన్ను దూరం చేసుకుందామనిపించినపుడల్లా, నీకు దగ్గరయ్యే పరిస్ధితి వచ్చినప్పుడు 
నిన్ను ఇంకెప్పుడూ చూడకూడదనుకున్న ప్రతిసారీ, ఎదురుగా నువ్వే ఉన్నప్పుడు 
నిన్ను మార్చాలనుకున్న ప్రతి విఫలయత్నం దాటి, అలవాటుగా నీవు చేసిన పనిలో అర్థం వెతుక్కున్నప్పుడు  
నువ్వు నిజమైన ప్రతిసారీ నేను అబద్ధమై అలసిపోతూనే ఉన్నాను....   
ఆ అలసట లొ ఓడిపొతునేఉన్నాను     

   

Tuesday, December 6, 2016

అనుకోని పరిచయం

శనివారం ఉదయం దిగాలుగా మొదలయ్యింది, ముందు రోజు వేద వాళ్ళు India వెళ్ళటం తొ. TANA వాళ్ళు పేద విద్యార్దుల scholarship  కోసం badminton games conduct చేస్తున్నారు అని చూడటానికి  friend రమ్మనటంతొ వెళ్ళాను. బయటే నిల్చుని చూస్తుంటె , చక్కగా చీరలొ చూడముచ్చటగా ఉన్న అమ్మాయి , లొపలికి రండి అని ఆత్మీయంగా   పిలిచింది.   కొందరిని చూసిన మొదటసారే ఎప్పుడో ఎక్కడో చూసినట్లు, ఎంతో పరిచయం ఉన్నట్లు ఏదో ఆత్మీయతాభావానుభూతి కలుగుతుంది.  నవ్య ని చూడటం మొదటిసారె అయినా ఎంతో పరిచయస్థురాలన్న అనుభూతి కలిగింది. తన  చిన్నారులు ఐశ్వర్య ,వైష్ణవి ని చూడగానే  ఏదో ఆత్మీయత! హృదయంలో అభిమానపు స్పందనలు! అలా match చూస్తూ, నవ్య, aunty,   పిల్లల  కబుర్లతొ కొన్ని గంటలు నిమిషాల్ల గడిచిపొయాయి.   అలా  దిగాలుగా మొదలయ్యిన ఆ రోజు నవ్య,ఐశ్వర్య ,వైష్ణవి , aunty తొ అయిన అనుకోని పరిచయం వల్ల   మంచి జ్ఞాపకాలతొ ముగిసింది.

జీవితం అనే రైలు ప్రయాణం లో ఎన్నెన్నో మలుపులు, కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులు, కొత్త మధురానుభూతులు..   కొందరు దగ్గర ఉన్నా  పట్టించుకోము. కొందరు  దూరంగా ఉంటె తట్టుకోలేము.  కానీ కొంత మంది  మాత్రం ఎక్కడున్నా   మనసులో ఎప్పుడు మెదులుతూనే ఉంటారు. 


Tuesday, May 17, 2016

ప్రకృతి ..నిత్యనూతనం నీ పరిచయం

ఈ ఉరుకుల పరుగుల రోజువారీ జీవితంలో కాస్త విరామం తీసుకుని , ఈ కాంక్రీట్ జంగల్ నుంచి పారిపోవాలనిపిస్తుంది.. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా పీల్చుకుని పచ్చని ప్రకృతి ఒడిలో వాలిపోవాలనిపిస్తుంది .  కాలాన్ని మర్చిపోయి కలల తీరంలో నిల్చిపొవాలనిపిస్తుంది .   పిల్ల కాలువలో నిలబడి చల్లని నీరు నా పాదాలను తాకుతూ, ఎలా ఉన్నావంటూ పిల్లగాలి నా మేను నిమురుతూ చెప్పె పలకరింపులు..  ఇవన్నిటి మధ్య సాగే ప్రయాణాన్ని ముగించాలంటే మనసంగీకరించదెమో . 

 ఈ కంప్యూటర్లు, సెల్ల్ఫొన్ల   వల్ల మనుషులు ప్రకృతికి దూరం అయిపొతున్నారనిపిస్తుంది..  ముఖ్యంగా పిల్లలు.

మన చిన్నతనంలొ కనీసం సెలవుల్లొ అయినా పచ్చని పంట పొలాల్లో ఒడ్లవెంట తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించేవాల్లము. చెరువులు, కుంటల్లో మునిగితేలటం , ప్రకృతి ప్రసాదితమైన పండ్లు, కాయలు తెంపుకుని తినటం  , ఆ పల్లె అందాలు, పల్లె అనుభూతులు..  ఇవన్నీ  తలుచుకుంటే,  ఇప్పటి  పిల్లలు  ప్రకృతికి  ఎంత  దూరంగా  బ్రతుకుతున్నారో  కదా    అనిపిస్తుంది. కాంక్రీటు అరణ్యాలలో, నిలువెత్తు భవనాలలో, ఎసి తరగతులలో ప్లాస్టిక్ మొక్కల పచ్చదనమే మహాద్భాగ్యంగా బ్రతుకుతున్నారు ఈనాటి పిల్లలు. ప్రకృతిని పుస్తకాలలోనే చూసిన పిల్లలకు ప్రత్యక్షంగా ప్రకృతిని ,వన్యప్రాణిని పరిచయం చేద్దాము,   పర్యావరణ సంబంధ యాత్రలు పిల్లలకు ఎంతో విజ్ఞానాన్ని ఇవ్వడమే కాక తక్షణపరిసరాలతో అనుబంధాన్ని ఏర్పరుస్తాయి. ప్రకృతి నేర్పే పాఠాలు పిల్లల మనోవికాసానికి పునాది వేస్తాయి.  కనీసం నెలలొ ఒకటి రెండు రొజులైనా యాంత్రిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో హాయిగా గడుపుదాము. వారంతం లో షాపింగ్ మాల్ కి వెళ్ళడం కన్నా పచ్చని చెట్లు, కొండల మధ్య ప్రకృతి లొ తిరగటం  మనసుకి,మనషికి రెంటికి మంచిదే కదా....  



Wednesday, March 23, 2016

వచ్చేసిందీ .. వసంత కాలం

Cousin పెళ్ళి కొసం కొద్ది రోజులు India వెళ్ళి  వచ్చేసరికి   మోడు పోయిన మా ఇంటి మందారం మొగ్గలతొ నిండుగా కనిపించింది. ఇలా కొమ్మ కొమ్మ కి పూలు పూసి కళకళలాడుతూ ఉంటే ఎంత సంబరంగా ఉందో!



 ఎక్కడికి వెళ్ళినా దారి వెంట పువ్వులు ఎంత అందంగా కనిపిస్తున్నాయొ . ప్రకృతి తన అందాలతొ  కనులకు విందును కలిగించె ఈ  వసంత కాలం అంటె నాకు ప్రత్యెకమైన అభిమానం . అమెరికా లో వసంత ఋతువు వచ్చింది అంటే చాలు,  చెట్లకి ఆకులు అన్నవి కనపడవు, పువ్వులతొ నిండుగా భలె అందంగా ఉంటాయి. దారి వెంట నడుస్తుంటె పూలవాసన ని మోసుకుంటూ వచ్చే  గాలి, పక్షుల కిల కిలా రావాలు  మనస్సుకు మైమరుపు కలిగిస్తాయి   . పొద్దున్నె మా ఇంటి కిటికీ దగ్గర నిలబడి  , అందమైన సుర్యొదయం , పూల మొక్కలు , పక్షులు .. అందమైనా ఆ దృశ్యం   చూస్తుంటే అస్సలు   కాళ్ళు కదలనంటాయి.




ఈ వారం మా పక్కింట్లొ ఉన్న మల్లె చెట్టు  నిండా పూలు పూసాయి  .. మా ఇంటి వరకు వచ్చిన   ఆ వాసనకి మనసు ఊహల్లొ తేలుతుంది ..మల్లె పూలు చూస్తే అమ్మను, చెల్లిని  చూసినంత సంతోషమేస్తుంది.   ఒక్కో పూవు తో ఎన్నెన్ని జ్ఞాపకాలో కదా   .. ఆడపిల్లలకి మనసు దొచుకునె పువ్వులను మించిన నేస్తాలు ఉండవంటె అతిశయొక్తి  కాదు    ..  వాసన తో  మరో లొకం లొ విహరింపచెసే మల్లెలంటె ఇష్టపడని మగువలుండరేమో ! 



 వసంత కాలం లో  ఆరు బయట పూల మొక్కల మద్య కూర్చుని తీయని కోయిల గళాన్ని ఆస్వాదిస్తూ  కుటుంబ సభ్యులతొ   కమ్మని కబుర్లు చెప్పుకుంటె ఎంత బావుంటుందో కదా .  

Thursday, August 13, 2015

రాని వర్షం కోసం....

కాలిఫోర్నియా వచ్చిన గత కొద్ది నెలలుగా  ఒకే ఒక్క మాట వినిపిస్తుంది " కరువు" . ఆ మాట వినగానే వర్షం కోసం మనస్సు ఇంకా పరితపిస్తుంది .

రాని వర్షం కోసం నేను, కాగితప్పడవలు వేయటానికి పిల్ల కాలువల కోసం మా అమ్మాయి రోజు ఎదురు చూస్తున్నాము 

వర్షం అంటే నాకు చాలా ఇష్టం. అయినా వర్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు ??

చిట పట చినుకులతో  మేనిని తాకి పరిసరాలని మైమరపింప చేసే వర్షం
తనతో పాటు  మనస్సుని పులకరింపచేసే ఆ మట్టి  వాసన తెచ్చే వర్షం
"ఇంత వర్షంలో బడికి  వద్దులె " అని అమ్మతో అనిపించే  వర్షం 
"వాన వాన వల్లప్ప" అని పిల్లలచే ఆడించే వర్షం
అందమైన నెమలితో నాట్యం చేయించే   వర్షం
చెట్లు  పశు పక్ష్యాదుల దాహార్తిని తీర్చే  వర్షం  
కన్నీళ్ళను   కనిపించకుండా తనతొ కలిసిపొయేలా చేసే వర్షం అంటే ఎవరికైనా ఇష్టమె.   

నీతో కాసేపు కలిసి తిరగాలని చేసిన కాగితప్పడవలని ముంచేసావు
స్నేహితులతో  ఆరు బయట ఆడుకుందామనుకుంటే  వాకిలిని బురదతో నింపేసావు  
నీ చిట పట చినుకుల్లో చిందేయాలని వస్తే , నీ ఉరుముల గర్జనలతో భయపెట్టావు
సంక్రాంతి పండుగకి  అమ్మ ఎంతో కష్టపడి  వేసిన ముగ్గుని చెరిపేసావు  

అయినా కూడా నువ్వంటే నాకు ఇష్టం.  అయినా వర్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు  ??





Wednesday, July 29, 2015

వేసవి సెలవులు


వేసవి సెలవులు .. నిండు వేసవి లో కురిసే  తొలకరి జల్లులు ..



పరీక్షలు ఎప్పుడెప్పుడు  అయిపొతాయా .. ఎప్పుడెప్పుడు సెలవులు ఇచ్చేస్తారా .  Hostel  నుండి   ఇంటికి  ఎప్పుడు  వెళ్ళిపోదామా  అని ఎదురు చూసేదాన్ని.  


పుస్తకాలు  ముందేసుకుని  చదువు మధ్యలోసెలవుల్లో ఎమేమి  చేయలా  అని ఊహించుకుంటూ  , పరిసరాలు   మర్చిపొయిన  సందర్భాలు  ఎన్నో :)


వేసవి  సెలవుల్లో, మేడ  పైన పడుకుని , అమ్మ, నాన్న , చెల్లి , తమ్ముడి   తో    కబుర్లు.. నాన్న అడిగే చిక్కు ముడులకు సమాధానాలు  అలొచిస్తూ .. అకాశం లొ చుక్కలు చూస్తూ పడుకోవటం ..   ఎంత  మధురమైన జ్ఞాపకమో   


సెలవులు అనగానే మొదటగా    గుర్తొచ్చేది     అమ్మమ్మ  వాళ్ళ  ఇంట్లో  గడిపిన   రోజులు ,  cousins తో  కలిసి శివ చింతకాయలు  కోయటం, జామ  చెట్లెక్కడం.  మావయ్య   వాళ్ళ పాత   Tractor parts  ఇనుప సామాను వాడికిచ్చి    మామిడి  పళ్ళు  కొనటం.


ఇక  చెల్లి, తమ్ముడు ,  cousins, చిన్న నాటి  స్నేహితులతో  ఆడిన ఆటలు   .. నాలుగు రాళ్ళ  ఆట, దాగుడు మూతలు,  కోతి కొమ్మచ్చి  ,  తొక్కుడు  బిళ్ళ , కచ్చ కాయలు ,  వామన గుంతలు .. అష్టా చమ్మా  , పాము నిచ్చెన,  carroms..  అమ్మమ్మా వాళ్ళ ఇంటి దగ్గర గుడి ప్రాంగణంలో చింత చెట్టు కింద ఆటలు .. నిజంగా  మరపు రాని జ్ఞాపకాలు  .


అరె! మామిడి పళ్ళు మర్చిపొతె ఎలా  :)  తాటి ముంజలు, మామిడి పళ్ళు, కొబ్బరి బొండాలు    ..  మావయ్య  తోటకి వెళ్ళి  పుచ్చ  కాయలు, కర్బూజ పళ్ళు తినటం.. ఎద్దుల బండి 
లో ప్రయాణం .. 

అమ్మ, అమ్మమ్మ చేసే  పిండి వంటలు .


Project చెరువు   కాలువలో ఈతలు   . తడి  బట్టలు ఆరెవరకు ఎండలో ఆటలు. సాయంకాలం కాకుల్లా మాడిపొయి ఇంటికి వచ్చి అమ్మ చేత తిట్లు .

సాయంత్రం అవ్వగానే మల్లె పూలు , సన్నజాజులు   కోసి దండ అల్లటం.  "నాకు పొడుగు దండ అంటే నాకు" అని తగువులాటలు.

గొరింటాకు రుబ్బి పెట్టుకుని, ఎవరి చేతులు ఎక్కువ ఎర్రగా పండుతాయా అని పోటీలు. 


Ice cream బండి రాగానే పెద్ద సందిగ్ధం  ..Pepsi తినాలా ? లేక సేమియా  ice cream తినాలా లేక కుల్ఫీ నా అని :)

బావి దగ్గర తాబేలుని  ఒక్కసారి చూడటం కోసం ఎదురుచూపులు ..


వానా కాలం మొదలవ్వగానే, కాగితప్పడవలు చేసి పిల్ల కాలవల్లొ వదలటం.


ఆ జ్ఞాపకాలను  వెతుక్కుంటూ  వెళ్ళిన నాకు ఇప్పుడా ఊరు కనిపించటం లేదు. 


ఎక్కడ చూసినా కనిపించే కోళ్ళు , ఆవులు, గేదెలు   ఎటు వెళ్ళాయో? 

ఎటు చూసినా పచ్చగా కనిపిస్తూ .. చల్లని నీడనిచ్చె చింత , వేప చెట్లు ఎమైపొయాయో 
పది అడుగులు వెసే లొపు వంద సార్లు  వినిపించె " ఎలా ఉన్నారు? ", " ఎప్పుడొచ్చారు? "   అని పలకరింపులు ఎమైపొయాయో? 
వర్షం పడగానె  వచ్చే మట్టి వాసన ఎక్కడికెళ్ళిన్దో..

ఇప్పుడు మనుషులకే కాదు , ఊరికి  వృద్ధాప్యం  వచ్చినట్టనిపిస్తుంది  .



 స్వచ్ఛమైన  స్వేచ్ఛ కు చిరునామ అయిన  ఆ బాల్యపు  రోజులు మళ్ళీ వస్తే బావుండనిపిస్తుంది  .  






Monday, June 8, 2015

పుట్టిన రోజు పండగే అందరికి

రోజులు క్షణాల్లా గడుస్తూ .. అప్పుడే ఒక సంవత్సరం గడిచిపోయింది , దియా ఈ లోకంలోకి వచ్చి .
చిన్నారి తల్లికి మొదటి పుట్టిన రోజు శుభాకాంక్షలు .

Party కి అంతా  సిద్ధం

ఇంటి కొచ్చిన అతిధులను చూసి దియా .. ఏంటి ఈ హడావిడి ?  ఎవరు వీళ్ళంతా  ?



ఇంకా ఎన్ని photos తీస్తారు ?



కేక్ భలే బావుంది .


అందరూ కేక్ తింటున్నారు .. నాకు మాత్రం పెట్టడం లేదు .. ఇంతకి పుట్టిన రోజు నాదేనా !!!



అమ్మా అప్పుడే అయిపోయిందా party ?


Thursday, July 24, 2014

చిన్నారి తల్లికి స్వాగతం

నీ రాక తో మా జీవితాల్లోకి ఎంతో సంతోషం తెచ్చిన బంగారు తల్లి దియా కి స్వాగతం .
 
 



నువ్వు నా ప్రపంచం లోకి అడుగు పెట్టి అప్పుడే రెండు నెలలు అయిపోయాయి .. చూస్తుండగానే రోజులు , వారాలు, నెలలు గడిచిపోతున్నాయి .. నిన్ను మొదటి సారి నా చేతుల్లోకి తీసుకున్న క్షణం నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది.  నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు అనుకునే క్షణం లోనే .. అమ్మా నీకు పోటి గా  నేనున్నాను అంటూ  చెల్లి చెల్లి అని పిలుస్తూ  ప్రత్యక్షమవుతుంది మీ అక్క వేద:)  మా జీవితాల్లో సంతోషం నింపిన మీరిద్దరూ కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. 




Thursday, June 19, 2014

First Day of School

Veda first day at preschool and this is exactly how I feel now !!!!



I wonder what you're doing right now 
and if everyone is treating you kind. 
I hope there is a special person, 
a nice friend that you can find.

I wonder if the teacher knows just 
how special you are to me. 
And if the brightness of your 
heart is something she can see.

I wonder if you are thinking of me 
and if you need a hug. 
I already miss the sound of your 
voice and how you give my leg a tug.

I wonder if you could possibly understand 
how hard it is for me to let you grow. 
On this day know that my heart breaks, 
for this is the first step in letting my baby go.

Tuesday, July 9, 2013

జాబిల్లీ

కదిలే మేఘం నేనై కాపలాగా ఉంటా 
చీకటి గా నే మారి నిన్ను గెలిపిస్తా 
జాబిల్లీ .. నీకై నేనంతమైపోతా 
జాలి తో నా పై నీ వెన్నెల కురిపిస్తావా 



Tuesday, May 28, 2013

అపురూపం

ముద్దొచ్చే  నాసిక  పై  చిన్ని  నొక్కే  అపురూపం
 అమాయకపు  కన్నుల్లో  ఆశ్చర్యమే  అపురూపం
 కురుల  సిరులలో  విరబూసిన  గులాబీ  అపురూపం
 అరవిప్పారిన  పెదవుల  పై చిరునవ్వే  అపురూపం
  చెక్కిలి  పై జాలువారే తొలి  సిగ్గే  అపురూపం
 నన్నలరించే  నా  చెలి  పిలుపు  లో నా పేరే  నాకు  అపురూపం


Monday, May 13, 2013

నిన్ను చేరాలని

నీవే ఒక సంద్రానివి అయితే
కెరటంలా నిన్ను చేరాలని ఉంది


నీవే ఆకాశమైతే జాబిల్లి లా
నీలో ఒదిగిపోవాలని ఉంది


నీవే మేఘానివి అయితే
చిరుగాలిలా నిన్ను తాకాలనిపిస్తుంది



Monday, May 6, 2013

ఋతువులు


పల్లవించే కొత్త కోరిక
పరిమళించే
వసంతం !

కోరికల సాంద్రతలో
రగిలిన ఆవేశం
గ్రీష్మం!

యోచనలో చల్లనైన
ఆవేశం సత్ఫలితం
వర్షం!

సత్ఫలితాల హర్షంలో
సంతృప్తి వెన్నెల
శరత్!

జీవ వెన్నెల వన్నెల
ప్రణాళికా గీతం
హేమంతం!


పండిన చెడు తలపులు
ఎండి మోడువారే
శిశిరం!



Monday, April 29, 2013

విరహం ..

వెన్నెలనూ
చంద్రుడినీ
వేరు చేసి హర్షిస్తుంది
విరహం ....


నీవు నా యెదలో
నింపిన  సంగీతాన్ని
నిర్దయతో మింగుతుంది
నిశబ్దం ....



Monday, April 22, 2013

నవ్వులే నవ్వులు -2


ఏవండోయ్... ఈ రోజు మన పెళ్లై  సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం" చెప్పింది సుగుణ.

"ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?" పెదవి విరుస్తూ అన్నాడు ప్రదీప్.

-----------------------------------------------------------------------------------
డాక్టర్ గారూ... ఈ మధ్య సరిగా నిద్ర పట్టడం లేదు. మంచి మందులేమైనా..." అడిగాడు శ్రీధర్.

"చూడండి.. నిద్ర పట్టడానికి మంచి వాతావరణం అవసరం. చక్కని మెత్తటి పరుపు, ఎత్తైన దిండ్లు, సుగంధభరితమైన్ అగరుబత్తి పొగలు, నీలంరంగు కాంతి బల్బు, కిటికీలకు మంచి కర్టెన్లు వేసుకుంటే నిద్ర దానంతట అదే వస్తుంది" చెప్పాడు డాక్టర్.

" కానీ ఆఫీసులో ఇన్ని వసతులు ఏర్పాటు చేసుకోవడానికి వీలు కాదేమో డాక్టర్..."సందేహం వెలిబుచ్చాడు శ్రీధర్.

-----------------------------------------------------------------------------------
నాకు చాలాకాలంపాటు బతకాలని ఉంది డాక్టర్. ఏమైనా హెల్త్ టిప్స్ చెబుతారా?" అడిగాడు రాము

"పెళ్ళి చేసుకోండి" సలహా ఇచ్చాడు డాక్టర్.
"అలాగైతే ఎక్కువ కాలం బతుకుతారా?" ఆశ్చర్యపోయాడు రాము.
"అదేం లేదులే. కాకపోతే అప్పుడు కాలం భారంగా గడుస్తూ ఎక్కువ కాలం బతికినట్టు అనిపిస్తుంది" అసలు సంగతి చెప్పాడు డాక్టర్.
-----------------------------------------------------------------------------------
రామారావు ప్రతి రోజూ బార్‍కెళ్ళి మందు తాగుతాడు. విషయం ఏమిటంటే ప్రతీ రోజూ రెండు గ్లాసులు ఆర్డర్ చేసి పక్క పక్కనే పెట్టుకుని, ఒక్ సిప్పు ఒక గ్లాసులోంచి ,మరీ సిప్పు రెండో గ్లాసులోంచి తాగుతాడు. ఈ తతంగం అంతా చాలా రోజుల నుంచి చూసిన సర్వర్ ఆనందం ఉండబట్టలేక ఒక రోజు రామారావుని అడిగేశాడు.

"నేను ఎప్పుడూ మందు నా స్నేహితుడు సుబ్బారావుతో కలిసి  తాగేవాడిని. ప్రమాదవశాత్తు అతను చనిపోయాడు. అతని జ్ఞాపకార్ధం ఈ విధంగా ఎప్పుడూ రెండు గ్లాసులు తాగుతున్నాను" చెప్పాడు రామారావు.

కొంతకాలం తరువాత రోజూ ఒక గ్లాసు మాత్రమే ఆర్డరు చెయ్యటం మొదలుపెట్టాడు రామారావు. ఈ విషయం గమనించిన సర్వర్ రామారావుని అడిగాడు "ఏంటి సార్ మీ స్నేహితుడిని పూర్తిగా మర్చిపోయారా?"

"లేదయ్యా నేను మందు మానేశాను" చెప్పాడు రామారావు.

-----------------------------------------------------------------------------------
రాధా....రాధా... వెంటనే మీ అమ్మగారిని గదిలోకి వెళ్ళి గంటదాకా బయటకు రావద్దని చెప్పు మా ఆఫీసరొస్తున్నారు" కంగారుగా అన్నాడు కృష్ణ.

"మీ ఆఫీసరుగారొస్తే మా అమ్మకేం భయమండీ?" అయోమయంగా అన్నది రాధ.

"అబ్బా... నీకు తెలియదు. మా అత్తగారు చనిపోయారని చెప్పి మొన్నటినుంచి సెలవులో ఉన్నాను" విషయం చెప్పాడు కృష్ణ.

-----------------------------------------------------------------------------------
చూడండి మిస్.. చాలా లేటెస్ట్ టైట్స్. జపాన్ నుంచి తెప్పించాం. ఇవి వేసుకున్నారంటే blood circulation దెబ్బకు పెరుగుతుంది" డ్రెస్సులు చూపిస్తూ షాపతను కవితతో చెప్పాడు.


"వీటిని ధరిస్తే blood circulation ఎలా పెరుగుతుంది" ఆశ్చర్యంగా అన్నది కవిత.


"మీది కాదు మిస్. మీరు చదివే కాలేజీలోని కుర్రాళ్ళది" చెప్పాడు షాపత
ను

-----------------------------------------------------------------------------------
నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు
"అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి.
"మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు

"మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి.
-----------------------------------------------------------------------------------
ఇద్దరు స్నెహితులు పందెం పెట్టుకొని టెన్నిస్ ఆడుతున్నారు. ఆట చివరికొచ్చాక బంతి కనిపించకుండా పోయింది. కాసేపు వెతికాక- "బాల్ లేదు కాబట్టి ఆట క్యాన్సిల్" ఓడిపోయేట్టున్న రాము.

"ఇదిగో దొరికింది" తన జేబులో బంతిని పడేసి అరిచాడు సోము.
"బోడి యాభై రూపాయల కోసం నన్ను మోసం చేస్తావా?"

"నిజంరా నాకు దొరికింది"
"ఎలా దొరుకుతుంది? నేను దానిమీద నిల్చుంటే?"

-----------------------------------------------------------------------------------

నువ్వు మన పొరిగింటాయనతో అంత కేర్ ఫ్రీగా మాట్లాడటం నాకు నచ్చడం లేదు" కోపంగా అన్నడు సుధాకర్ భార్యతో.

"ఏం? మీరు మాత్రం ఆయనతో ఆయన భార్యతో అంత ఫ్రీగా మాట్లాడటం లేదూ?" అన్నది భార్య.

"నాకేం? నేను మగాణ్ణి"

"మరి ఆయన మాత్రం మగాడు కాదూ?" అన్నది భార్య.

-----------------------------------------------------------------------------------

Monday, April 15, 2013

నవ్వులే నవ్వులు


సోమవారం ఉదయం అంటేనే ఏంటో చెప్పలేని దిగులు  వచ్చేస్తుంది నాకు . దిగాలుగా ఉన్న మీ సోమవారం కాస్త నవ్వుల మయం చేయాలనీ నాకు నచ్చిన కొన్ని జోకులు మీకోసం ... 




వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.
"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.
----------------------------------------------------------------------------------

నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని.

"వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి.

"ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా.
----------------------------------------------------------------------------------

పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం

"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు
----------------------------------------------------------------------------------

మా నాన్నగారి death certificate submit చేస్తే కానీ మా అమ్మకు pension ఇవ్వరట. అదేదో ఇచ్చి పుణ్యం కట్టుకోండి డాక్టర్ గారు.

"ఓ.. అలాగా... దానికేం భాగ్యం.... ఇంతకీ మీ నాన్న గార్ని treat చేసిన డాక్టరెవరు?
"ఆయన అదృష్టవంతులండి.. ఏ డాక్టర్ treat చెయ్యలేదండీ... ఆయనంతట ఆయనే పోయారు...."
----------------------------------------------------------------------------------
రావయ్యా చంద్రం! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు" అన్నాడు డాక్టర్ సుందర్.
"ఎందుకండీ?" అన్నాడు చంద్రం.
"ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు bounce అయిందట" అన్నాడు డాక్టర్.
"మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది" బదులిచ్చాడు చంద్రం.
----------------------------------------------------------------------------------

డాక్టర్ ప్రకాశ్ దగ్గర ట్రీట్‍మెంట్ తీసుకుంటున్నాడు గోపాల్.

"మీరు నేను గాఢమైన మిత్రులం. ఫీజిచ్చి ఓ మంచి స్నేహితుణ్ణి అవమానించలేను. ఫ్రీగా సేవ చేయించుకోవడమూ ఇష్టం లేదు. కాబట్టి మీకు ఎంతో కొంత అందేలా నా వీలునామాలో మార్పులు చేస్తా" చెప్పాడు గోపాల్.
"డబ్బు కాస్త త్వరగా అవసరం. ఓసారి ఆ ప్రిస్ర్కిప్షన్ ఇస్తారా? నేను కొద్దిగా మార్పులు చేస్తా" అన్నాడు డాక్టర్ ప్రకాశ్.
----------------------------------------------------------------------------------

టర్కీ వాళ్ళని టర్క్స్ అని పిలుస్తారు. మరి జర్మనీ వాళ్ళనూ..." పాఠం చెబుతోంది టీచర్.

"నాకు తెలుసు టీచర్" చెప్పాడు బంటీ

"ఏమంటారు"

"జెర్మ్స్" జవాబిచ్చాడు బంటీ
----------------------------------------------------------------------------------

9"న్యూటన తల మీద ఆపిల్ పడి భూమ్యాకర్షణ శక్తిని కనుక్కోవడం వల్ల మనం బతికిపోయాం కదమ్మా" స్కూల్లో పాఠం విని వచ్చాక తల్లితో చెప్పడు బంటీ.

"అదేంట్రా? " అడిగింది తల్లి.

"నాన్నది బెల్టుల బిజినెస్ కదా. మరి భూమ్యాకర్షణ లేకపోతే వాటినెవరు కొంటారు" వివరించాడు బంటీ.
----------------------------------------------------------------------------------

అత్తగారింటికి వెళ్తున్నది కూతురు. జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి.

"చూడమ్మా... ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు తిను" చివరి జాగ్రత్తగా చెప్పింది.


"ఓహో! అందులో ఏవైనా హానికర పదార్థాలేమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అంతేనా మమ్మీ" అన్నది ఆధునికతరం యువతి.






Monday, April 8, 2013

వర్షంలో కారేసుకుని

వర్షంలో కారేసుకుని షికారుకెల్లాలని ,
అందమైన గులాభి రెక్కలపై చివర్లో మిగిలిన ముత్యాల్లాంటి 
వర్షపు చినుకులను నాలుక చివరతో ఆస్వాదించాలని ,
కాలివేళ్ల మధ్య నుంచి జాలువారే వర్షపు నీటి 
పిల్లకాలువలకు బుల్లి బుల్లి కట్టలేయాలని ,
సముద్రపు ఒడ్డున గూళ్ళు కట్టుకుని 
వాటిలో పాదాలు దూర్చాలని ,
వానే వరదయి వర్షించే వేళ 
ఎవరు చూడని ఏకాంత ప్రదేశాలకెళ్ళి 
వర్షంలో తడిసిపోవాలని 





Monday, April 1, 2013

ఉడతకి ఒకటి , బుడతకి ఒకటి

రోజు సాయంత్రం కాగానే , వేద నేను కలిసి కాసేపు తెలుగు Rhymes పాడుకుంటాము . కానీ రోజు పాడి పాడి చిట్టి చిలకమ్మా,  గుమ్మాడమ్మా  గుమ్మాడి  ఇంకా Youtube లో ఉన్న పాటలన్నీ వేద కి bore కొట్టేసాయి.  అందుకే  వేద  కోసం ఒక కొత్త పాట ... 

నాన్న తెచ్చెను పలకలు రెండు 
ఉడతకి ఒకటి , బుడతకి ఒకటి 

మామ తెచ్చెను బొమ్మలు నాలుగు 
ఉడతకి రెండు  , బుడతకి రెండు 

తాత తెచ్చెను పండ్లు ఆరు 
ఉడతకి మూడు బుడతకి మూడు 

అమ్మ చేసెను గారెలు చాలా 
ఉడతకి కొన్ని మరి  బుడతకి ఎన్ని ??







Tuesday, March 26, 2013

పుట్టిన రోజు వేడుక విశేషాలు

వేద రెండవ పుట్టిన రోజు వేడుక విశేషాలు రాయాలని 10 రోజుల నుండి అనుకుంటుంటే .. ఈ రోజుకి కాస్త తీరిక  దొరికి ఇలా పుట్టిన రోజు వేడుక విశేషాలు, ఫోటోలతో వచ్చేసాను. వేద  పుట్టిన రోజు మార్చ్ 15 అయినప్పటికీ  శుక్రవారం అవ్వటం తో మార్చ్ 16, శనివారం బంధు , మిత్రుల సమక్షం లో వేడుక చేసుకున్నాము. 

మేము  పుట్టిన రోజు కోసం బాడుగ తీసుకున్న గది మా ఇంటికి చాల దూరం ఉండటం తో ఉదయాన్నే నేను, రాజీవ్ ఇద్దరు స్నేహితులతో కలిసి హాల్ decorate చేయటానికి బయల్దేరాము . స్నేహితుల సహాయం తో 11 కల్లా  అలంకరణ పూర్తి అయ్యింది . వేద కి సీతకోకచిలక అంటే చాల ఇష్టం. అందుకే party కోసం  butterfly theme ఎంచుకున్నాను. 11:45 కల్లా  Photographer  వచ్చేసింది . magician చివరి నిమిషం లో phone  చేసి, ఆరోగ్యం బాలేదు, రావటం లేదు అని చెప్పేసరికి చాల disappoint అయ్యాను :( . అతిధులు కాస్త ఆలస్యంగా రావటంతో party కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాము. మొత్తానికి బంధు మిత్రువుల మధ్య, పిల్లల హడావిడితో వేద పుట్టిన రోజు వేడుక చాలా సందడి గా  జరిగింది. 

వేద  పుట్టిన రోజు వేడుక ఇంత ఘనంగా  జరగటానికి సహాయం చేసిన మిత్రులందరికి, పుట్టినరోజు వేడుకకి వచ్చి చిన్నారి తల్లిని దీవించిన బంధు , మిత్రులందరికి నా  ధన్యవాదాలు . 



వేద party hall కి వచ్చేసరికి అక్కడ ఉన్న అతిదులందరినీ చూసి .. ఏమి జరుగుతుంది ఇక్కడ అని confusion :)




Cake cut  చేయటానికి నేను ready .. మరి cake ఎక్కడ ??



Cake కూడా ready 




Happy Birthday to You ...... 






Cake cut చేయటం అయిపోయాక కాసేపు కబుర్లు , తరువాత బోజనాలు 



బోజనాల తరువాత butterfly pinata ని కొట్టటానికి పిల్లలందరూ ready 



10 నిమిషాలు కొట్టాక మొత్తానికి pinata విరిగిపోయింది . 


pinata  లోని chocolates, candy కోసం పిల్లలందరూ పోటి 


party కి వచ్చిన పిల్లలందరి  కోసం return gifts 


అమ్మా అప్పుడే అయిపోయిందా party :)

Thursday, March 14, 2013

చిన్నారి తల్లి కి పుట్టిన రోజు లేఖ



చిట్టి తల్లి  ...  ఎవరని చూస్తున్నావా .. నేనే రా అమ్మని .. 

నీ రెండవ పుట్టిన రోజు  నీకోసం ఒక ఈ లేఖని రాయాలనుకున్నాను .. నాకు తెలుసు నువ్వు అప్పుడే చదవలేవని .. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఈ లేఖని నువ్వు చవినప్పుడు నీకు అర్ధం అవుతుంది నాకు నువ్వంటే ఎంత ఇష్టమో ... 

ఏంటో రోజులు ఎంత తొందరగా గడిచిపోతున్నాయి .. అప్పుడే ఎంత పెద్దదానివైపోయావు   అనిపిస్తుంది .. మొన్నేగా బోర్లా పడ్డావు .. అప్పుడే ఇల్లంతా పరిగెత్తి మమ్మల్ని పరిగెత్తిస్తున్నావు :)

నువ్వు చెప్పే చిన్ని చిన్ని మాటలు , నువ్వు అమ్మ అని  ముద్దుగా పిలవటం .. Hug Me అంటూ వచ్చి నన్ను గట్టిగా  వాటేసుకోవటం  నాకు ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో మాటల్లో చెప్పలేను. 

నువ్వు నిద్రపోతుంటే ప్రశాంతంగా , అమాయకంగా కనిపించే నీ ముఖం ఎంత సేపు చూసినా నాకు తనివి తీరదు. 

నువ్వు నా జీవితం లోకి వచ్చి ఈరోజు కి సరిగ్గా 730 రోజులు . ఈ 730 రోజుల్లో నువ్వు మా మీద చూపించిన ప్రేమ, మాకు కలిగించిన సంతోషం మాటల్లో వెల కట్టలేనిది . 

నీ చిరునవ్వుతో , చిట్టి చిట్టి చేష్టలతో ఎంత బాధలో ఉన్నవారినయినా నవ్వించగలవు .  నువ్వు ఇలాగే ఇంకో 100 సంవత్సరాలు నవ్వుతూ, నీ  పక్కనున్నవారిని నవ్విస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను .. 

 I Love You so much Veda Baby.





బోర్లా పడితే బొబ్బట్లు 

  


నీకు 4 mothns .. తాతయ్య తో షికారు కెల్లటానికి ready



కృష్ణాష్టమి రోజు చిన్ని కృష్ణుడి లా నీ చిరునవ్వులు చూసి ఎంత సంబర పడ్డామో .. 




నీకు సరిగ్గా 6 Months.. కేక్ కట్ చేసి నీకు పెట్టకుండా మేము తినేసాము :)




మొదటి సారి నీకు రెండు పిలకలు వేసి, నేను మురిసిపోయిన రోజు . 




 Halloween 2011



India వెళ్ళినప్పుడు మావయ్య తో ఆడుకుంటూ 




తిరుమల తిరుపతి దేవస్తానం లో తల నీలాలు సమర్పించాక 



చిన్నప్పుడు, ఇప్పుడు కూడా నీళ్ళతో ఆడటం కంటే ఇష్టమైన పని నీకు ఇంకోటి ఉండేది కాదు 



అడుగులకి అరిసెలు 



నీ మొదటి పుట్టినరోజు వేడుక 




Mother's Day రోజు downtown లో  మనం matching matching dress వేసుకుని తిరుగుతూ 




ఈ రోజుకి  నువ్వు మా జీవితాల్లోకి అడుగు పెట్టి  సరిగ్గా 500 రోజులు 



మొదటి రాఖి పండుగ 



కృష్ణాష్టమి 2012



నువ్వు, నేను, నాన్న.. అమ్మమ్మ ని తాతయ్యని తీసుకుని Niagara Falls చూడటానికి వెళ్ళినప్పుడు 




Elevators,  Escalators చూస్తే చాలు పరిగెత్తేదానివి



Chicago River  లో Boat లో నీ 18 Months Birthday



Halloween 2012



Dec 2012 , మావయ్య పెళ్ళిలో