Monday, April 22, 2013

నవ్వులే నవ్వులు -2

ఏవండోయ్... ఈ రోజు మన పెళ్లై  సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం" చెప్పింది సుగుణ.

"ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?" పెదవి విరుస్తూ అన్నాడు ప్రదీప్.

-----------------------------------------------------------------------------------
డాక్టర్ గారూ... ఈ మధ్య సరిగా నిద్ర పట్టడం లేదు. మంచి మందులేమైనా..." అడిగాడు శ్రీధర్.

"చూడండి.. నిద్ర పట్టడానికి మంచి వాతావరణం అవసరం. చక్కని మెత్తటి పరుపు, ఎత్తైన దిండ్లు, సుగంధభరితమైన్ అగరుబత్తి పొగలు, నీలంరంగు కాంతి బల్బు, కిటికీలకు మంచి కర్టెన్లు వేసుకుంటే నిద్ర దానంతట అదే వస్తుంది" చెప్పాడు డాక్టర్.

" కానీ ఆఫీసులో ఇన్ని వసతులు ఏర్పాటు చేసుకోవడానికి వీలు కాదేమో డాక్టర్..."సందేహం వెలిబుచ్చాడు శ్రీధర్.

-----------------------------------------------------------------------------------
నాకు చాలాకాలంపాటు బతకాలని ఉంది డాక్టర్. ఏమైనా హెల్త్ టిప్స్ చెబుతారా?" అడిగాడు రాము

"పెళ్ళి చేసుకోండి" సలహా ఇచ్చాడు డాక్టర్.
"అలాగైతే ఎక్కువ కాలం బతుకుతారా?" ఆశ్చర్యపోయాడు రాము.
"అదేం లేదులే. కాకపోతే అప్పుడు కాలం భారంగా గడుస్తూ ఎక్కువ కాలం బతికినట్టు అనిపిస్తుంది" అసలు సంగతి చెప్పాడు డాక్టర్.
-----------------------------------------------------------------------------------
రామారావు ప్రతి రోజూ బార్‍కెళ్ళి మందు తాగుతాడు. విషయం ఏమిటంటే ప్రతీ రోజూ రెండు గ్లాసులు ఆర్డర్ చేసి పక్క పక్కనే పెట్టుకుని, ఒక్ సిప్పు ఒక గ్లాసులోంచి ,మరీ సిప్పు రెండో గ్లాసులోంచి తాగుతాడు. ఈ తతంగం అంతా చాలా రోజుల నుంచి చూసిన సర్వర్ ఆనందం ఉండబట్టలేక ఒక రోజు రామారావుని అడిగేశాడు.

"నేను ఎప్పుడూ మందు నా స్నేహితుడు సుబ్బారావుతో కలిసి  తాగేవాడిని. ప్రమాదవశాత్తు అతను చనిపోయాడు. అతని జ్ఞాపకార్ధం ఈ విధంగా ఎప్పుడూ రెండు గ్లాసులు తాగుతున్నాను" చెప్పాడు రామారావు.

కొంతకాలం తరువాత రోజూ ఒక గ్లాసు మాత్రమే ఆర్డరు చెయ్యటం మొదలుపెట్టాడు రామారావు. ఈ విషయం గమనించిన సర్వర్ రామారావుని అడిగాడు "ఏంటి సార్ మీ స్నేహితుడిని పూర్తిగా మర్చిపోయారా?"

"లేదయ్యా నేను మందు మానేశాను" చెప్పాడు రామారావు.

-----------------------------------------------------------------------------------
రాధా....రాధా... వెంటనే మీ అమ్మగారిని గదిలోకి వెళ్ళి గంటదాకా బయటకు రావద్దని చెప్పు మా ఆఫీసరొస్తున్నారు" కంగారుగా అన్నాడు కృష్ణ.

"మీ ఆఫీసరుగారొస్తే మా అమ్మకేం భయమండీ?" అయోమయంగా అన్నది రాధ.

"అబ్బా... నీకు తెలియదు. మా అత్తగారు చనిపోయారని చెప్పి మొన్నటినుంచి సెలవులో ఉన్నాను" విషయం చెప్పాడు కృష్ణ.

-----------------------------------------------------------------------------------
చూడండి మిస్.. చాలా లేటెస్ట్ టైట్స్. జపాన్ నుంచి తెప్పించాం. ఇవి వేసుకున్నారంటే blood circulation దెబ్బకు పెరుగుతుంది" డ్రెస్సులు చూపిస్తూ షాపతను కవితతో చెప్పాడు.

"వీటిని ధరిస్తే blood circulation ఎలా పెరుగుతుంది" ఆశ్చర్యంగా అన్నది కవిత.

"మీది కాదు మిస్. మీరు చదివే కాలేజీలోని కుర్రాళ్ళది" చెప్పాడు షాపత
ను

-----------------------------------------------------------------------------------
నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు
"అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి.
"మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు

"మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి.
-----------------------------------------------------------------------------------
ఇద్దరు స్నెహితులు పందెం పెట్టుకొని టెన్నిస్ ఆడుతున్నారు. ఆట చివరికొచ్చాక బంతి కనిపించకుండా పోయింది. కాసేపు వెతికాక- "బాల్ లేదు కాబట్టి ఆట క్యాన్సిల్" ఓడిపోయేట్టున్న రాము.

"ఇదిగో దొరికింది" తన జేబులో బంతిని పడేసి అరిచాడు సోము.
"బోడి యాభై రూపాయల కోసం నన్ను మోసం చేస్తావా?"

"నిజంరా నాకు దొరికింది"
"ఎలా దొరుకుతుంది? నేను దానిమీద నిల్చుంటే?"

-----------------------------------------------------------------------------------

నువ్వు మన పొరిగింటాయనతో అంత కేర్ ఫ్రీగా మాట్లాడటం నాకు నచ్చడం లేదు" కోపంగా అన్నడు సుధాకర్ భార్యతో.

"ఏం? మీరు మాత్రం ఆయనతో ఆయన భార్యతో అంత ఫ్రీగా మాట్లాడటం లేదూ?" అన్నది భార్య.

"నాకేం? నేను మగాణ్ణి"

"మరి ఆయన మాత్రం మగాడు కాదూ?" అన్నది భార్య.

-----------------------------------------------------------------------------------

3 comments:

  1. hha.. hha,.. meeru ilaage raasi mammalni navvistundandee..-:)

    ReplyDelete
  2. బావున్నాయి మీ కవితలు, పాప కబుర్లు, అడ్వెంచర్లు, నవ్వులు :)

    ఒక చిన్న సలహా: వీలైతే పోస్ట్స్ పబ్లిష్ చేసేటపుడు వాటికి labels (కవితలు, ఫొటోలు etc ) యాడ్ చేయగలరా ! readers కు మీ బ్లాగ్ navigate చేయడానికి సులభంగా ఉంటుంది.

    ఇట్లు,
    ఒకప్పటి హరివిల్లు :)

    ReplyDelete