Monday, April 15, 2013

నవ్వులే నవ్వులు

సోమవారం ఉదయం అంటేనే ఏంటో చెప్పలేని దిగులు  వచ్చేస్తుంది నాకు . దిగాలుగా ఉన్న మీ సోమవారం కాస్త నవ్వుల మయం చేయాలనీ నాకు నచ్చిన కొన్ని జోకులు మీకోసం ... 

వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.
"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.
----------------------------------------------------------------------------------

నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని.

"వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి.

"ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా.
----------------------------------------------------------------------------------

పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం

"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు
----------------------------------------------------------------------------------

మా నాన్నగారి death certificate submit చేస్తే కానీ మా అమ్మకు pension ఇవ్వరట. అదేదో ఇచ్చి పుణ్యం కట్టుకోండి డాక్టర్ గారు.

"ఓ.. అలాగా... దానికేం భాగ్యం.... ఇంతకీ మీ నాన్న గార్ని treat చేసిన డాక్టరెవరు?
"ఆయన అదృష్టవంతులండి.. ఏ డాక్టర్ treat చెయ్యలేదండీ... ఆయనంతట ఆయనే పోయారు...."
----------------------------------------------------------------------------------
రావయ్యా చంద్రం! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు" అన్నాడు డాక్టర్ సుందర్.
"ఎందుకండీ?" అన్నాడు చంద్రం.
"ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు bounce అయిందట" అన్నాడు డాక్టర్.
"మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది" బదులిచ్చాడు చంద్రం.
----------------------------------------------------------------------------------

డాక్టర్ ప్రకాశ్ దగ్గర ట్రీట్‍మెంట్ తీసుకుంటున్నాడు గోపాల్.

"మీరు నేను గాఢమైన మిత్రులం. ఫీజిచ్చి ఓ మంచి స్నేహితుణ్ణి అవమానించలేను. ఫ్రీగా సేవ చేయించుకోవడమూ ఇష్టం లేదు. కాబట్టి మీకు ఎంతో కొంత అందేలా నా వీలునామాలో మార్పులు చేస్తా" చెప్పాడు గోపాల్.
"డబ్బు కాస్త త్వరగా అవసరం. ఓసారి ఆ ప్రిస్ర్కిప్షన్ ఇస్తారా? నేను కొద్దిగా మార్పులు చేస్తా" అన్నాడు డాక్టర్ ప్రకాశ్.
----------------------------------------------------------------------------------

టర్కీ వాళ్ళని టర్క్స్ అని పిలుస్తారు. మరి జర్మనీ వాళ్ళనూ..." పాఠం చెబుతోంది టీచర్.

"నాకు తెలుసు టీచర్" చెప్పాడు బంటీ

"ఏమంటారు"

"జెర్మ్స్" జవాబిచ్చాడు బంటీ
----------------------------------------------------------------------------------

9"న్యూటన తల మీద ఆపిల్ పడి భూమ్యాకర్షణ శక్తిని కనుక్కోవడం వల్ల మనం బతికిపోయాం కదమ్మా" స్కూల్లో పాఠం విని వచ్చాక తల్లితో చెప్పడు బంటీ.

"అదేంట్రా? " అడిగింది తల్లి.

"నాన్నది బెల్టుల బిజినెస్ కదా. మరి భూమ్యాకర్షణ లేకపోతే వాటినెవరు కొంటారు" వివరించాడు బంటీ.
----------------------------------------------------------------------------------

అత్తగారింటికి వెళ్తున్నది కూతురు. జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి.

"చూడమ్మా... ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు తిను" చివరి జాగ్రత్తగా చెప్పింది.

"ఓహో! అందులో ఏవైనా హానికర పదార్థాలేమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అంతేనా మమ్మీ" అన్నది ఆధునికతరం యువతి.

3 comments:

  1. enjoyed.... I must read them again tomorrow.

    ReplyDelete
  2. సెకండ్ జొక్ "నాన్న..నాన్న.." నిజంగా చదువుతుంటె తెలియకుండానే నవ్వ్వు వచ్చెసింది...హ్హ..హ్హ..హ్హ .. మీరిలాగె జొక్స్ రాయాలని నా కొరిక..

    ReplyDelete