Monday, April 8, 2013

వర్షంలో కారేసుకుని

వర్షంలో కారేసుకుని షికారుకెల్లాలని ,
అందమైన గులాభి రెక్కలపై చివర్లో మిగిలిన ముత్యాల్లాంటి 
వర్షపు చినుకులను నాలుక చివరతో ఆస్వాదించాలని ,
కాలివేళ్ల మధ్య నుంచి జాలువారే వర్షపు నీటి 
పిల్లకాలువలకు బుల్లి బుల్లి కట్టలేయాలని ,
సముద్రపు ఒడ్డున గూళ్ళు కట్టుకుని 
వాటిలో పాదాలు దూర్చాలని ,
వానే వరదయి వర్షించే వేళ 
ఎవరు చూడని ఏకాంత ప్రదేశాలకెళ్ళి 
వర్షంలో తడిసిపోవాలని 





3 comments:

  1. మీ కవిత చదువుతుంటే వర్షం లో తడిసిన అనుభూతి '..........

    ReplyDelete