అపురూపం
ముద్దొచ్చే నాసిక పై చిన్ని నొక్కే అపురూపం
అమాయకపు కన్నుల్లో ఆశ్చర్యమే అపురూపం
కురుల సిరులలో విరబూసిన గులాబీ అపురూపం
అరవిప్పారిన పెదవుల పై చిరునవ్వే అపురూపం
చెక్కిలి పై జాలువారే తొలి సిగ్గే అపురూపం
నన్నలరించే నా చెలి పిలుపు లో నా పేరే నాకు అపురూపం
చాలా బాగుంది . చెక్కిలిపై జాలువారే అంటే ఇంకా బాగుండేది అనిపించింది .
ReplyDeleteThanks Nagarani garu :)
Delete