Monday, April 1, 2013

ఉడతకి ఒకటి , బుడతకి ఒకటి

రోజు సాయంత్రం కాగానే , వేద నేను కలిసి కాసేపు తెలుగు Rhymes పాడుకుంటాము . కానీ రోజు పాడి పాడి చిట్టి చిలకమ్మా,  గుమ్మాడమ్మా  గుమ్మాడి  ఇంకా Youtube లో ఉన్న పాటలన్నీ వేద కి bore కొట్టేసాయి.  అందుకే  వేద  కోసం ఒక కొత్త పాట ... 

నాన్న తెచ్చెను పలకలు రెండు 
ఉడతకి ఒకటి , బుడతకి ఒకటి 

మామ తెచ్చెను బొమ్మలు నాలుగు 
ఉడతకి రెండు  , బుడతకి రెండు 

తాత తెచ్చెను పండ్లు ఆరు 
ఉడతకి మూడు బుడతకి మూడు 

అమ్మ చేసెను గారెలు చాలా 
ఉడతకి కొన్ని మరి  బుడతకి ఎన్ని ??







4 comments:

  1. బాగుందండి బుజ్జి పాపాయికి బుజ్జి పాట

    ReplyDelete
  2. యు ట్యూబ్ లో ముద్దు గారే యశోద చాలా బాగుంది.మీ బ్లాగ్ కూడా

    ReplyDelete
    Replies
    1. Thanks Radhika garu :)

      mee satyapriya blog naku chala ishtam :)

      Delete
    2. Idhi nee sontha paata.... ?????

      Delete