ఇంట్లో చిన్నారులుంటే సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది భోగి పళ్ళు .
భోగి పండగ రోజు చిన్నారులందరికి భోగి పళ్ళు పోయటం మన ఆనవాయితి .
సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో, శనగలు, పూలు, చెరుకుగడలు, నాణేలను కలిపి కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా తలపై పోసి దిష్టి తొలగిస్తారు .
ఆ పళ్లు పోస్తే సూర్యదేవుడి ఆశీర్వాదం లభిస్తుందని అంటారు,అంతేకాక ఆ పళ్లు తలమీద నుంచి పోస్తారు అలా పోస్తే అవి జారి కిందకు పడతాయి అందువల్ల శరీరం అంతా సూర్యుడి శక్తి లభిస్తుందని ప్రతీతి.
మా ఇంట్లో ఈ సంవత్సరం వేద కి ఆర్య కి అమ్మమ్మ తాతయ్య దగ్గరుండి భోగి పళ్ళు పోసారు .
No comments:
Post a Comment